Wednesday, March 29, 2023

దర్గా దర్శనానికి వెళ్లి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా..

- Advertisement -

tractor*ముగ్గురు మృతి .. ఆరుగురికి గాయాలు..
*డ్రైవర్ నిర్లక్షంతోనే ప్రమాదం..

మన తెలంగాణ/పాన్‌గల్ ః పాన్‌గల్ బాలపీర్ల దర్గాలో మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చి తిరిగి వెళ్తుండగా పాన్‌గల్ సమీపంలోని కోదండం బావి దగ్గర ప్రమాదవ శాత్తు ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మృతి చెంది, ఆరుగురికి గాయాలైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం…నాగర్‌కర్నూల్ జిల్లా బొందలపల్లి గ్రామానికి చెందిన దాదాపు 70 మంది భక్తులు బాలపీర్ల దర్గాకు తమ మొక్కులు తీర్చుకునేందుకు 5 ట్రాక్టర్లలో వచ్చారు. దర్గాలో మొక్కు తీర్చుకొని భోజనం చేసిన తర్వాత స్వగ్రామానికి వెనుదిరిగారు. తిరిగు ప్రయాణంలో దర్గాకు కేవలం కిలో మీటర్ దూరంలో డ్రైవర్ అజాగ్రత్తతో ట్రాక్టర్ బోల్తా ప్రమాదం జరిగింది. దర్గా దగ్గర నుండి శివ అనే యువకుడు ట్రాక్టర్‌ను నడుపుతుండగా అతని తండ్రి తిరుపతయ్య మధ్యం మత్తులో తాను ట్రాక్టర్‌ను నడుపుతానని పక్కకు తప్పుకోమని కుమారుడు శివ నుండి డ్రైవింగ్ తీసుకున్నాడు. నీవు మధ్యం సేవించి ఉన్నావని నేను ట్రాక్టర్ ఎక్కనని శివ ట్రాక్టర్ దిగిపోయాడు. దీంతో తండ్రి తిరుపతయ్య వెనక్కి చూసుకుంటూ ట్రాక్టర్ నడుపుతూ తన కుమారుడు శివను ట్రాక్టర్ ఎక్కమని అడుగుతుండగా ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డు దిగి బోల్తాపడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈసంఘటనలో డ్రైవింగ్ చేస్తున్న తిరుపతయ్య (45) ,అతని ప్రక్కనే కూర్చున్న
మౌనిక (16), అక్కడికక్కడే మృతి చెందగా, మృతుడు తిరుపతయ్య భార్య తిరుపతమ్మ (39) తీవ్ర
గాయాల పాలై వనపర్తి ఆసుపత్రిలో మృతి చెందింది. వీరితో పాటు చనిపోయిన యువతి తండ్రి
బాలస్వామి ,సత్యమ్మ, బంగారమ్మ, బాలస్వామి, శివ అనే వ్యక్తులకు గాయాలు కాగా 108
అంబులెన్స్ సహాయంతో క్షతగాత్రులను చికిత్స కోసం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు.
ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో మరణించిన ముగ్గురు, గాయాల పాలైన ఆరుగురు
ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో అక్కడికి వచ్చిన ప్రజలు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
*సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సిఐ .వెంకటేశ్వర్లు ..
బాలపీర్ల దర్గా సమీపంలో గురువారం ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటనను తెలుసుకున్న సిఐ వెంకటేశ్వర్లు
హుటాహుటిన సంఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. ప్రమాద వివరాలను ప్రత్యక్ష సాక్షుల ద్వారా
ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్‌ఐ వెంకట్‌తో కలిసి శవ పంచనామా నిర్వహించి
మృత దేహాలను వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ
మధ్యం తాగి వాహనాలు నడుపవద్దని ఎన్ని పర్యాయాలు వివరించినా వాహనదారులు నిబంధనలను
పాటించకపోవడం దురదృష్టకరమన్నారు. రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలను చూసైనా మధ్యం
సేవించి వాహనాలు నడుపడం ఇక ముందు మానివేయాలని ఆయన వాహనదారులను సూచించారు.
మృతుడు తిరుపతయ్య సోదరుడు వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు
సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News