అంటిగ్వా: ఐపిఎల్ సందర్భంగా తాను వర్ణ వివక్షకు గురయ్యానని ప్రకటించి పెను ప్రకంపనలు సృష్టించిన వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి తన ఆరోపణలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. ఐపిఎల్‌లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సమయంలో సహచర ఆటగాడు ఒకడూ తనను కాలు అని పిలిచే వాడన్నాడు. కాలు అంటే నల్జజాతీయుడు అనే అర్థం అని తనకు తెలిసి ఎంతో బాధపడ్డానన్నాడు. అయితే తన ఆరోపణలపై తనను కాలు అని పిలిచిన క్రికెటర్ స్పందించాడన్నాడు. తనపై ఉన్న ప్రేమతో అలా పిలిచాడని, కాలు అనే పదంలో ఎలాంటి వర్ణ వివక్ష ఉండదని ఆ క్రికెటర్ వివరించాడన్నాడు.
తాము ఇష్టపడే వారిని ఇలాంటి నిక్‌నేమ్‌తో పిలవడం ఇండియాలో సర్వసాధరణమని ఆ ఆటగాడు తనతో చెప్పాడన్నాడు. ఇందులో ఎలాంటి వర్ణ వివక్ష లేదని, కేవలం ప్రేమ మాత్రమే దాగివుందనే విషయాన్ని అతను గుర్తు చేశాడన్నాడు. నల్లగా ఉండే వారిని భారత్‌లో కాలు అని పిలుస్తారని, ఇలా పిలవడాన్ని ఎవరూ కూడా తప్పుపట్టరని ఆ ఆటగాడు తెలిపాడన్నాడు. దీంతో తాను అనవసరంగా ఈ వివాదాన్ని పెద్దగా చేశాననే బాధ కలిగిందన్నాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా సామి అభిమానులకు వివరించాడు.