Thursday, March 28, 2024

‘దసరా’ టీజర్ వచ్చేస్తోంది..

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దసరా’ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. నాని కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రమిది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా మేకర్స్ బిగ్ అనౌన్స్‌మెంట్‌తో వచ్చారు. జనవరి 30న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌కి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇది. అనౌన్స్ మెంట్ వీడియోలో మధ్య వయస్కుడైన గ్రామస్థుడు బీడీ వెలిగించి, అగ్గిపుల్లని విసిరినప్పుడు మంటలు చెలరేగుతాయి.

ఆ మంటల్లో టీజర్ తేదీని తెలియజేయడం చాలా ఆసక్తికరంగా వుంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా, దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. దసరా చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News