Home తాజా వార్తలు సాహితీ వేత్త ఎల్లూరి శివారెడ్డికి దాశరథి అవార్డు

సాహితీ వేత్త ఎల్లూరి శివారెడ్డికి దాశరథి అవార్డు

Dasaradhi award for famous writer dr. eluri siva reddy

 

నేడు ప్రదానం చేయనున్న మంత్రి శ్రీనివాసగౌడ్

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు యూనివర్సిటీ మాజీ ఉపకులపతి, సాహితీ వేత్త డాక్టర్. ఎల్లూరి శివారెడ్డి దాశరథి కృష్ణమాచార్య అవార్డుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంపిక చేశారని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసినట్టు ఆయన పేర్కొన్నారు. 2021 సంవత్సరానికి ఈ అవార్డుకు డా. ఎల్లూరి శివారెడ్డి ఎంపికయ్యారని ఆయన తెలిపారు. డా. ఎల్లూరి శివారెడ్డిది ఉమ్మడి మహబుబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్‌కు జిల్లా. దాశరథి జయంతి సందర్భంగా ఎల్లూరి శివారెడ్డికి అవార్డుతో పాటు రూ. 1,01,116 నగదును మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేడు హైదరాబాద్‌లో అందజేయనున్నారు. సాహిత్య రంగంలో విశేషంగా కృషి చేసిన వారిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ప్రతి ఏడాది దాశరథి జయంతి (జులై 22) రోజున ఆ అవార్డును ప్రదానం చేస్తోంది. ఈ అవార్డు ప్రదానం 2015 సంవత్సరం నుంచి కొనసాగుతోంది. తెలుగు సాహిత్యంలో విశిష్ఠ స్థానం సంపాదించిన దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22న వరంగల్ జిల్లా గూడూరులో జన్మించారు. 2015లో తొలి దాశరథి సాహితీ పురస్కారాన్ని కవి ఆచార్య తిరుమల శ్రీనివాసాచార్యకు ప్రదానం చేశారు.

Dasaradhi award for famous writer dr. eluri siva reddy