Thursday, April 25, 2024

రాఫెల్ ఒప్పందానికి 7.5 మిలియన్ యూరోల ముడుపు

- Advertisement -
- Advertisement -

Rafel deal
ఫ్రాన్స్: ఫ్రెంచ్ యుద్ధ విమానాల తయారీ సంస్థ డస్సాల్ట్ భారత్‌తో రాఫెల్ ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు 7.5 మిలియన్ యూరోలను మధ్యదళారులకు చెల్లించినట్లు ‘మీడియాపార్ట్’ అనే పోర్టల్ తాజాగా వెల్లడించింది. ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న విషయంపై డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) దర్యాప్తు జరపలేదని కూడా ఆ పోర్టల్ పేర్కొంది. ఈ తాజా వార్త ప్రతిపక్షాలకు ఆయుధంగా మారగలదని భావిస్తున్నారు. ‘తప్పుడు ఇన్వాయస్‌లతో డస్సాల్ట్ మధ్య దళారులకు ముడుపులు చెల్లించింది’ అని ఆ పోర్టల్ ఆరోపించింది. ఈ ముడుపుల చెల్లింపుల్లో ఆఫ్‌షోర్ కంపెనీలు, బూటకపు కాంట్రాక్టులు, తప్పుడు ఇన్వాయిస్‌లు చోటుచేసుకున్నాయని కూడా ఆ పోర్టల్ తెలిపింది. దళారీ సుశేన్ గుప్తాకు 2007 నుంచి 2012 మధ్య కాలంలో సీక్రేట్ కమిషన్లు అందాయట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News