Home లైఫ్ స్టైల్ ఖర్జూరాలతో రక్తహీనతకు చెక్

ఖర్జూరాలతో రక్తహీనతకు చెక్

Dates

యాభైశాతానికి పైగా మహిళలు రక్తహీనతతో  బాధపడుతున్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సమస్యనుంచి బయట పడాలంటే ఇనుము ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి.  శరీరానికి కావాల్సిన ముఖ్య పోషకాల్లో ఇనుము ఒకటి. ఇది లోపిస్తే అలసట, ఆయాసం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తుంటాయి. ఇలా తరచుగా వస్తుంటే రక్తహీతన ఉన్నట్లు లెక్క. వెంటనే వైద్యుని వద్దకు వెళ్లి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమస్య గర్భిణుల్లో ఉంటే, అది పుట్టబోయే బిడ్డపై పడుతుంది. డాక్టర్ సూచనల మేరకు ఐరన్ మాత్రలు వేసుకోవాలి. ఇనుమును తగిన  మోతాదులో తీసుకోవాలి. దీని వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. ఇది శరీరానికి కావాల్సిన ప్రాణవాయువును సరఫరా చేస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయాలంటే తగినంత ప్రాణవాయువు అందాలి.

 ఐరన్ శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీక రిస్తుంది. కండరాల ఆరోగ్యం కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది. ఐరన్ తక్కువైతే కండరాలు సరిగ్గా పనిచేయవు. ఏ పని చేసినా త్వరగా అలిసిపోతారు. మనం తీసుకునే ఆహార పదా ర్థాల ద్వారా శరీరానికి కావాల్సిన ఇనుము అందనప్పుడు వైద్యుని సలహా మేరకు ఇనుము, ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకోవాలి.   శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గితే మలేరియా, టైఫాయిడ్, వంటి వ్యాధులు, ఎముకల్లో బలహీనత ఏర్పడతాయి. అందువల్ల ఆహారంలో మార్పులు చేయడం అవసరం. ఉదయం అల్పాహారంతోపాటు ఒక గ్లాసు పాలు, ఒక పండు నాలుగు ఖర్జూరాలు తీసుకోవాలి. సాయంత్రం నాలుగ్గంటలకు రాగిజావ, ఒక అరటిపండు తీసుకోవాలి. భోజనంలో ప్రతిరోజూ పప్పు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. నిద్రపోయే ముందు గుప్పెడు వేరుశనగలు, కాస్త బెల్లం, నాలుగు ఖర్జూరాలు తీసుకోవాలి.