Home యాదాద్రి భువనగిరి కేంద్రమంత్రి దత్తాత్రేయకు కలెక్టర్ ఘనస్వాగతం

కేంద్రమంత్రి దత్తాత్రేయకు కలెక్టర్ ఘనస్వాగతం

DATTU

మన తెలంగాణ/ చౌటుప్పల్ ః కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ గురువారం చౌటుప్పల్‌లో ఘన స్వాగతం పలికారు. చౌటుప్పల్ మండలంలోని వివిధ పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కలిపించేందుకు  మండలంలోని లింగోజిగూడెంలో బిజెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, జిల్లా జాయింట్ కలెక్టర్ రవినాయక్, చౌటుప్పల్ ఆర్డీవో ఎస్. సూరజ్‌కుమార్‌లు తదితరులు చౌటుప్పల్‌లోని అటవీశాఖ  అతిథి గృహం వద్ద కేంద్ర మంత్రి దత్తాత్రేయకు ఘ  స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌తో కాసేపు ముచ్చటించారు. జిల్లా యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం జిల్లాలో నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు ఏ మేరకు అవగాహన కల్పించారని ఆరా తీశారు. ప్రతి ఒక్కరికీ క్యాష్‌లెస్ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం మండల పరిధిలోని లింగోజిగూడెం చీకోటి విజయలక్ష్మి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన నగదు రహిత లావాదీవీల అవగాహన సదస్సుకు మంత్రి దత్తాత్రేయ వెళ్లిపోయారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయను స్వాగతించిన వారిలో మండల పరిధిలోని వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.