Home తాజా వార్తలు రిటైర్డ్ జస్టిస్ నూతిపై కోడలు ఫిర్యాదు

రిటైర్డ్ జస్టిస్ నూతిపై కోడలు ఫిర్యాదు

మామ, భర్త, అత్త దాడి చేశారని సింధు శర్మ ఆరోపణ

Complaint

 

మన తెలంగాణ/హైదరాబాద్:  విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై వారి కోడలు సింధు శర్మ  శనివారం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను విచక్షణా రహితంగా మామ నూతి రామ్మోహన్ రావుతో పాటు, భర్త వశిష్ట, అత్త దుర్గ జయలక్ష్మి దాడి చేశారని సింధు శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తనను శారీరకంగా, మానసికంగా అత్తింటి వారు వేధిస్తున్నారంటూ తన గాయాలు చూపిస్తూ రోధించింది. దాడిలో గాయపడిన తాను ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నానని వివరించారు. తన కూతుళ్లను తనకు ఇవ్వకుండా మానసిక క్షోభకు గురిచేస్తున్నారని, తన బిడ్డలను తనకు అప్పగించాలని పోలీసులను వేడుకుంది. తన మామతో పాటు భర్త, అత్తపై చర్యలు తీసుకోవాలని వివరించింది. సింధు శర్మ ఫిర్యాదును స్వీకరించిన సిసిఎస్ పోలీసులు ఐపీసీ 498-A, 406,323 సెక్షన్లతో పాటు డీపీ 4, 6 చట్టం కింద నూతి రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.

 

Daughter in Law Complaint on Justice Nuti Rammohan Rao