Home తాజా వార్తలు అత్తను హత్య కేసులో కొడలే నిందితురాలు

అత్తను హత్య కేసులో కొడలే నిందితురాలు

Murder

 

హైదరాబాద్: అత్త హత్య కేసులో కొడలే నిందితురాలిగా తెలిన సంఘటన చంద్రాయణగుట్ట, హోషామాబాద్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మార్చి 30 వ తేదీన తన అత్త (ఖైరున్ బేగం) మంచంపై నుంచి జారి పడి మృతిచెందినట్లుగా కొడలు చంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కొడలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. పోలీసుల విచారణలో తెలిన విషయం ఏంటంటే కొడలే అత్తను చీరతో గొంతు నులిమి హత్య చేసినట్టుగా ఫోరెన్సిక్ నివేదికలో బయటపడ్డింది. దీంతో పోలీసులు కొడలిని విచారించగా అనారోగ్యంతో బాధ పడ్డుతున్న అత్తకు సేవలు చేయలేకు తనే అత్తమర్చినట్లు తెలిపింది. ఈ మేరకు కొడలిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టుగా పోలీసులు స్పష్టం చేశారు.

Daughter in law to be found guilty in aunt murder case