Home తాజా వార్తలు బాలిక హంతకుడు కన్నతండ్రే?

బాలిక హంతకుడు కన్నతండ్రే?

Murder

మేడ్చల్‌లో ముఖం చెక్కేసి హత్యచేసి సంచిలో కుక్కి పారేసిన బాలిక హంతకుడు సొంత తండ్రేనని అనుమానం

మేడ్చల్‌లో బాలిక హత్యోదనంతంలో మిస్టరీలో కన్న తండ్రే కాలయముడా…? అన్న కోణంలో పో లీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఆరవ తరగతి చ దువుతున్న బాలికను అతిదారుణంగా హత్య చేసి సంచిలో కుక్కి జనావాస ప్రదేశంలో పడేసిన ఘ టన శనివారం మేడ్చల్ పోలీస్ ఠాణా పరిధిలో జ రిగిన సంగతి తెలిసిందే. బాలిక గొంతుకోసి, ఆనవాళ్లు గుర్తించకుండా కనుగుడ్లు పీకి, మొహంచెక్కి అత్యంత దారుణంగా హతమార్చారు. అనంతరం గోనెసంచిలో కుక్కి.. సమీపంలోని చెత్తకుండిలో పడేశారు. బాలికను ఎక్కడో హత్యచేసి మృతదేహా న్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా? లేక ఆమె స్థానికురాలేనా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. అయితే బాలిక తండ్రిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు దానికి అనుగుణంగా విచారణ చేస్తున్నారు. ఈ కేసులో బాలిక కన్న తండ్రే ఆమె పా లిట కసాయిగా మారాడని పోలీసులు అనుమాని స్తూ ఆదిశగా దర్యాప్తు చేపడుతున్నారు. బాలికను అతిదారుణంగా అత్యాచారం చేసి అంతమొందించాడు. తండ్రే హంతకుడని అనుమానించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాలిక తండ్రి సుబ్రహ్మణ్యంకు ఇద్దరు భార్యలుండగా మృతురాలు పెద్ద భార్య కుమార్తెగా పోలీసులు గుర్తించారు. మేడ్చల్ పట్టణం కిందిబస్తీలోని ఓ ఖాళీ స్థలంలో ఉన్న సంచిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

వారు అక్కడకు చేరుకొని పరిశీలించగా.. గుర్తు తెలియని బాలిక గొంతుకోసి ఆనవాళ్లు తెలియకుండా మొహంపై చర్మాన్ని చెక్కి రెండు కళ్లను పీకేసినట్లు గుర్తించారు. డాగ్‌స్వ్కాడ్ సహాయంతో ఆధారాలు సేకరించే ప్రయత్నం చేయగా.. అవి బస్తీలోని పలు చోట్ల తిరిగి ఆగిపోయాయి. స్థానిక, ఎస్‌ఒటి పోలీసులు కాలనీని జల్లెడ పట్టారు. సమీప ప్రాంతాల్లో సిసి కెమెరాలు లేకపోవడం, వర్షం పడటంతో డాగ్‌స్వ్కాడ్ సైతం నిందితుల జాడ పసిగట్టకపోయాయి. అనుమానం వచ్చిన పోలీసులు మృతురాలి తండ్రిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఈక్రమంలో బాలిక కన్న తండ్రే దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. విచారణలో బాలిక తండ్రి సుబ్రహ్మణ్యం పోలీసులకు పొంతనలేని సమాధానాలు చెపుతుండడంతో అతని తీరుపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన బాలిక నిందితుడి మొదటి భార్య కూతురిగా పోలీసులు గుర్తించారు. బాలిక హత్యగావించబడిన తర్వాత యువతి తండ్రి తన కూతురు కనిపించడంలేదని తండ్రి సుబ్రమణ్యం పోలీసులకు సమాచారం

అందించేందుకు పోలీస్ స్టేషన్‌కు రాగా పోలీసులు యువతి తండ్రి సుబ్రమణ్యంను తమ అదుపులో ఉంచుకున్నట్లు సమాచారం. బాలిక మేడ్చల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నట్లు సమాచారం. సుబ్రమణ్యం మచ్చబొల్లారం పరిధిలో నివాసముంటుండేవాడని అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు కేసుల్లో సుబ్రమణ్యం నిందితుడిగా ఉన్నాట్లు సమాచారం. కాగా రెండవ భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు సమాచారం. తమకు అడ్డుగా ఉన్నట్లు భావించుకుంటున్న సుబ్రమణ్యం బాలికను హత్య చేసేందుకు ఉసిగొల్పినట్లు సమాచారం. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. కాలనీ వాసులు హత్యకు గురైన యువతి కుటుంబ సభ్యులు నివాసముంటున్న ఇంటి ముందు ఆందోళన నిర్వహించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Daughter Killed By Father in Medchal