Friday, July 11, 2025

అమ్మమ్మ బర్త్ డే సెలబ్రేట్ చేసేందుకు వచ్చి.. లండన్ కు తిరిగి వెళ్తుండగా..

- Advertisement -
- Advertisement -

అహ్మాదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం.. ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తమ అమ్మమ్మ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరిపేందుకు ఇండియాకు వచ్చి ఇద్దరు మనవరాళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల లండన్ నుంచి అహ్మదాబాద్ కు వచ్చిన ఇద్దరు యువతులు.. తమ అమ్మమ్మ బర్త్ డేను సెలబ్రేట్ చేసి గురువారం తిరుగు పయనమయ్యారు. లండన్‌కు తిరిగి వెళ్లేందుకు అహ్మాదాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం ఎక్కి బయల్దేరారు. ఇంతలోనే విమానం కూలిపోవడంతో వారితోపాటు విమానంలో ప్రయాణిస్తున్న అందరూ మరణించారు. ఈ ఘటనలో ఒకే ఒక ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 297 మంది మరణించగా.. మరికొంత మంది గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటితో ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News