Saturday, April 20, 2024

సన్‌రైజర్స్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్

- Advertisement -
- Advertisement -

david-warner

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ తిరిగి ఎంపికయ్యాడు. బాల్ టాంపరింగ్ ఆరోపణల నేపథ్యంలో వార్నర్ ఒక ఏడాది పాటు సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించలేదు. కిందటి సీజన్‌లో మళ్లీ జట్టులోకి వచ్చినా ఆటగాడిగానే కొనసాగాడు. ఈ రెండు సీజన్లలో సన్‌రైజర్స్ జట్టుకు న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ఈసారి మాత్రం తిరిగి వార్నర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని సన్‌రైజర్స్ యాజమాన్యం నిర్ణయించింది. ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించింది.

2020 సీజన్‌లో హైదరాబాద్ జట్టుకు వార్నర్ సారథ్యం వహిస్తాడు. కెప్టెన్‌గా, ఓపెనర్‌గా వార్నర్ సన్‌రైజర్స్‌పై తనదైన ముద్ర వేశాడు. కిందటి సీజన్‌లో కూడా అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. నిషేధం తర్వాత తొలిసారి ఐపిఎల్‌లోనే ఆడాడు. ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్నా ఐపిఎల్‌లో మాత్రం దుమ్ము రేపాడు. ఇక, ఈసారి కెప్టెన్సీ అప్పగించడంతో వార్నర్ మరింత చెలరేగే అవకాశాలున్నాయి. కాగా, సన్‌రైజర్స్ జట్టుకు తిరిగి కెప్టెన్‌గా ఎంపిక కావడంపై వార్నర్ ఆనందం వ్యక్తం చేశాడు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు.

david warner sunrisers hyderabad captain

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News