Tuesday, April 23, 2024

వార్నర్ భావోద్వేగం..

- Advertisement -
- Advertisement -

David Warner was emotional

 

దుబాయి: సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ భావోద్వేగానికి గురయ్యాడు. ఐపిఎల్ సీజన్14 వార్నర్‌కు ఓ పీడకలగా మారిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగిన వార్నర్‌కు ఈసారి ఏది కలిసి రాలేదు. జట్టు వరుస ఓటముల నేపథ్యంలో తొలి దశలోనే కెప్టెన్సీ కోల్పోయాడు. అంతేగాక కనీసం తుది జట్టులో కూడా చోటు దక్కించుకోలేక పోయాడు. అయితే యుఎఇ వేదికగా జరిగిన రెండో దశ ఆరంభ మ్యాచుల్లో వార్నర్‌కు ఓపెనర్‌గా మరో అవకాశం లభించింది. ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో రెండో దశ పోటీలకు అందుబాటులో లేక పోవడంతో వార్నర్‌కు ఓపెనర్‌గా దిగే ఛాన్స్ దక్కింది. కానీ వార్నర్ మాత్రం అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ నిరాశ పరిచాడు. దీంతో సన్‌రైజర్స్ యాజమాన్యం అతనికి తర్వాతి మ్యాచుల్లో అవకాశం ఇవ్వలేదు. ఇక చివరి మ్యాచుల్లోనైనా వార్నర్‌కు ఛాన్స్ దొరుకుతుందని భావించిన అభిమానులకు, వార్నర్‌కు నిరాశే మిగిలింది. ఇక హైదరాబాద్ ఫ్రాంచైజీ యాజమాన్యం తనను ఘోరంగా అవమానించడంపై వార్నర్ ఎంతో బాధకు గురయ్యాడు.

లీగ్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలోనే సోషల్ మీడియా వేదికగా యాజమాన్యంపై విమర్శలు గుప్పించాడు. హైదరాబాద్‌తో తన ప్రస్థానం ముగిసిందని ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఇక హైదరాబాద్ లీగ్ దశలోనే వెనుదిరగడంతో సన్‌రైజర్స్‌తో వార్నర్ అనుబంధానికి దాదాపు తెరపడిందనే చెప్పాలి. ఇదే విషయాన్ని వార్నర్ శనివారం ట్విటర్ వేదికగా వెల్లడించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తన ప్రయాణం ముగిసింది. సన్‌రైజర్స్‌తో పాటు అభిమానులను మిస్ అవుతానని పేర్కొన్నాడు. ఇన్నాళ్లు అండగా నిలిచిన అభిమానులకు సరిపడా కృతజ్ఞతలు కూడా చెప్పలేక పోయానని వాపోయాడు. జట్టును వీడినా సన్‌రైజర్స్‌పై తన అభిమానం ఏ మాత్రం తగ్గదని స్పష్టం చేశాడు. వచ్చే సీజన్‌లో హైదరాబాద్‌కు ఆడే ప్రసక్తే లేదని పేర్కొన్నాడు. కాగా కొంతకాలంగా సన్‌రైజర్స్ యాజమాన్యానికి, వార్నర్‌కు మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. దీంతో యాజమాన్యం వార్నర్‌ను కెప్టెన్సీతో పాటు తుది జట్టు నుంచి తప్పించింది. ఇక వార్నర్‌ను ఘోరంగా అవమానించిన సన్‌రైజర్స్ యాజమాన్యంపై సోషల్ మీడియా వేదికగా పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News