Home తాజా వార్తలు దేశానికి ఉత్తమ సేవలు అందించాలి

దేశానికి ఉత్తమ సేవలు అందించాలి

Minister Dayakar Rao congratulated Civils Rankers Dr. P. Sreeja and Varshitha

సివిల్స్ టాపర్లతో మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ : విధినిర్వహణలో సమర్ధతను చాటుకుంటూ దేశానికి ఉత్తమ సేవలు అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు సివిల్స్ టాపర్లకు సూచించారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 20వ ర్యాంకు సాధించి డా.పి.శ్రీజ, 413 వర్యాంకు సాధించిన వర్షితలను మంత్రి దయాకర్ రావు అభినందించారు. వరంగల్ జిల్లాకు చెందిన వీరిద్దరు వరంగల్ కీర్తి పతాకను దేశవ్యాప్తంగా రెపరెపలాడించారన్నారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వీరు విజయం సాధించడం గర్వంగా ఉందన్నారు. వారి తల్లితండ్రులు అందించిన ప్రోత్సాహం, తోడ్పాటు అభినందనీయం అన్నారు. భావి తరాలకు ఆదర్శంగా నిలిచి కేంద్ర కేడర్ అధికారులుగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ర్యాంకులు సాధించిన మిగిలిన వారికి మంత్రి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.