Home తాజా వార్తలు జిల్లాలో కడియం బడిబాట

జిల్లాలో కడియం బడిబాట

Kadiyam-Srihari

వరంగల్ రూరల్ : జిల్లా పరిధిలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్చించడమే బడిబాట కార్యక్రమం ఉద్దేశమని కడియం ఈ సందర్భంగా పేర్కొన్నారు. దుగ్గొండి మండల పరిధిలోని పలు పాఠశాలలను ఆయన సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. టెట్ పరీక్ష అనంతరం ఉపాధ్యాయుల నియామకం చేపడుతామని ఆయన చెప్పారు. ఎస్‌టి విద్యార్థినీల కోసం 20 కాలేజీలను మంజూరు చేస్తూ సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారని కడియం వెల్లడించారు.