Friday, March 29, 2024

మీ సేవ ఉద్యోగి హత్య…. మొండెం, తలను వేరు చేసి….

- Advertisement -
- Advertisement -

 

పెద్దపల్లి  : మీ సేవ ఉద్యోగి హత్య చేసిన అనంతరం తల, మొండాన్ని వేర్వేరు పదేశాల్లో పడేసిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రామగుండంలోని  మీ సేవ కేంద్రంలో శంకర్ కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నారు. కాజిపల్లి గ్రామానికి చెందిన శంకర్ రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. శనివారం మల్యాల రాజీవ్ రహదారి పక్కన తల కనిపించడంతో వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తల శంకర్ దిగా గుర్తించారు. తలకు కొంచెం దూరంలో నరికేసిన చేతులను గుర్తించారు. మొండెం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధమా? లేదా ఆస్తి తగాదాల నేపథ్యంలో హత్య జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News