Friday, March 29, 2024

లోయర్ మానేరు డ్యామ్ లో గుర్తు తెలియని మృతదేహం….

- Advertisement -
- Advertisement -

Dead body found lower manair dam

కరీంనగర్: లోయర్ మానేరు డ్యామ్‌లో యువతి మృతదేహం కనిపించిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో జరిగింది. మత్యకారులు చేపలు పట్టేందుకు డ్యామ్‌లో దిగినప్పుడు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలి వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News