Home మంచిర్యాల కల్తీ కోరలు

కల్తీ కోరలు

  • మండలంలో జోరుగా కల్తీ వ్యాపారం
  • రోగాలబారిన ప్రజలు
  • ప్రేక్షకపాత్రలో అధికారులు

Adulterated-Food

జన్నారం : మండలంలోని మారుమూల గ్రామాల్లో వినియోగదారులు నాణ్యమైన సరుకులు లభించకపోవడంతో కల్తీ సరుకులతో పలు కష్టాలను ఎదుర్కొంటూ అనేక రకాల వ్యాధులకు గురువుతున్నారు. మండల కేంద్రంలోని పలు దుఖానాలలో కల్తీ సరుకులను అమ్మడంతో గ్రామీణ ప్రాంతాలలోని చిన్న చిన్న వ్యా పారస్థులు సైతం వీటిని కొంత చౌకధ రలకే కొనుగోలు చేసి, అమ్ముతున్నారు. దీంతో కల్తీ సరుకుల సమ్మకం, మూడు పువ్వు లు ఆరు కాయలుగా కొనసాగుతుం ది. పప్పులు నాణ్యతగా కనిపించడా నికి కొంత మంది వ్యాపారస్థులు వివి ధ రంగులు వాడుతుండడం వలన ప్రజలకు క్యాన్సర్, పక్ష’వాతం లాం టి ఇతర వ్యాధులు కూడా సోకే ప్ర మాదం ఉందని వైద్యులు తెలుపుతు న్నారు. నిత్యం వాడే ప్రతి సరుకులను కూడా కల్తీ చేసి, విచ్చల విడిగా విక్రయి స్తున్న సంబంధిత కల్తీ నిరోధశాఖ సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయ మని ప్రజలు వాపోతున్నారు. కల్తీ నిరోధక శాఖ చట్టం ప్రకారం…కల్తీ చేయడం నేరమని తెలిసికూడా వ్యాపారస్థులు కల్తీ వ్యాపారాన్ని అడ్డుఅదుపు లేకుండా కొన సాగిస్తున్నారు. అదే విధంగా గిరిజన తండాలలో మారు మూల గ్రామాల్లోని ప్రజల నిరాక్షరాస్యతను ఆసరగా చేసుకొని, వ్యాపారస్థులు కల్తీ వస్తువులను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. నిత్యావసరాల్లో ప్రధానమైన బియ్యంలో కలిపే తెల్లని చిన్న చిన్న రాళ్లు, ఇసుక తో వినియోగదారులు ఇబ్బందులు పడుతు న్నారు. వంట నూనెలో తక్కువ ధరకు లభిం చే ఆముధం లాంటివి కలుపుతున్నారనే వి మర్శలు ఉన్నాయి. వేరు శనగ నూనెకు ఉండే డిమాండ్‌తో వ్యాపారులు ధర తక్కు వగా ఉండి ఎక్కువ బరువు తూగె నూనెలను కలిపి వంట నూనెలను కల్తీ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అదే విధంగా హోటళ్లలో వాడిన టి పొడిని తీసుకువచ్చి దానిని శుద్ధి చేసి, కొంత మంచి టి పొడిని కలిపి కృత్రిమ రంగు లను కలపి విక్రయిస్తున్నట్లు జో రుగా ఆరో పణలు ఉన్నాయి. ప్యాకే ట్లలోని టీ పొడికంటే విడిగా దొరికే టీ పొడి అత్యంత తక్కవ ధరకు లభిచడంతోచాలా మం ది తాజాగా దొరికే టీ పొడిని కొనుగోలు చేస్తున్నారు. వక్కపొండి , గసాల వంటి సుగంధ ధ్రవ్యాలలో ఇసుక, దుమ్ము, దూళి వంటి ప్రదార్థాలను కలుపుతున్నారనే ఆరో పణ లు ఉన్నాయి. కంది పప్పులో కేసరి పప్పు, శనగపిండిలో బియ్యం పిండి , గోదుమ పిండిలో తవుడు, ఇసుక చాక్ కలుపుతున్నారని తెలుస్తోంది. ఇలా కల్తీ వస్తువులతో జబ్బులను కొనితెస్తుండగా మందులు జబ్బులను తగ్గించడం మాట ఆటుంచి, కొత్త జబ్బులను తెస్తూ రో గనిరో ధక శక్తిని దారుణంగా చంపేస్తున్నాయని పలువురు చెబుతున్నారు. ఇదంతా జరుగుతున్నప్పటికీ సంబందిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈవిషయంలో పలువురు వ్యాపారస్థులను సంప్ర దించగా నిత్యావసర సరుకుల్లో తాము ఎలాంటి క ల్తీ చేయడం లేదని, గిట్టని వారు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.