Home తాజా వార్తలు ఆ సినిమాపై ఫోకస్ చేయడం లేదట

ఆ సినిమాపై ఫోకస్ చేయడం లేదట

Vijay Devarakonda

 

యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ మరో పది రోజుల్లో విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో ఈ కథానాయకుడు బిజీగా ఉన్నారు. విజయ్ ఈ సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్ళిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి క్రాంతి మాధవ్ సినిమా కాగా మరొకటి ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెరక్కుతున్న ‘హీరో’. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అన్ టైటిల్ ఫిలింను గత ఏడాది అక్టోబర్‌లో లాంచ్ చేయడం జరిగింది. ఫిబ్రవరి మొదటివారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయట.

షూటింగ్ ప్రారంభమై ఇప్పటికి ఆరు నెలలైనా 30 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయిందని సమాచారం. ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ జరుగుతోందట. ‘డియర్ కామ్రేడ్’ కారణంగా విజయ్ ఈ సినిమాపై పెద్దగా ఫోకస్ చేయడం లేదని ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. మరి ‘డియర్ కామ్రేడ్’ రిలీజ్, ప్రమోషన్స్ హడావుడి ముగిసిన తర్వాత విజయ్ ఈ సినిమాపై ఫోకస్ చేసి మిగతా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తారేమో చూడాలి. అయితే ఈ సినిమాతో పాటుగా ఆనంద్ అన్నామలై ‘హీరో’ కూడా సెట్స్ పైన ఉంది కాబట్టి రెండు సినిమాల షూటింగ్‌కు విజయ్ తన సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది.

ఒకవేళ విజయ్ కనుక ‘హీరో’ సినిమాకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చిన పక్షంలో క్రాంతి మాధవ్ సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.అయితే అభిమానులకు ఈ షూటింగ్ షెడ్యూల్స్ గోలతో సంబంధం లేకుండా రెగ్యులర్‌గా విజయ్ సినిమాలు థియేటర్లలోకి వస్తూ ఉంటే వారు హ్యాపీగా ఉంటారు. ‘డియర్ కామ్రేడ్’ ఎలాగూ ఈ నెలలో రిలీజ్ అవుతోంది కాబట్టి మరో ఆరు నెలల గ్యాప్ వచ్చినా వారు ఎదురు చేస్తారు. ఆలోపు క్రాంతిమాధవ్ సినిమా లేదా ఆనంద్ అన్నామలై మూవీతో గానీ విజయ్ ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమే.

Dear Comrade release in ten days