Home భద్రాద్రి కొత్తగూడెం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Death in the road accident

కామేపల్లి: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని గోవింద్రాల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… మహబూబాబాద్ జిల్లా డోర్లకల్ మండలం, ఎన్నారం గ్రామానికి చెందిన పసునూటి గోపాల కృష్ణ (35)తన ద్విచక్రవాహనంపై డోర్నకల్ నుండి ఖమ్మం వెలుతుండగా గోవింద్రాల గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆవును ఢి కొనడంతో కృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన కృష్ణను ఓ ప్రైవేటు వాహనంలో ఖమ్మం తరలిస్తుండగా మార్గమద్యలో మృతిచెందాడు. మృతునికి భార్య కలదు. దీంతో ఆ కుటుంబంలో విశాధఛాయలు అలుముకున్నాయి. స్థాయిక పోలీసులు కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నారు.