Saturday, April 20, 2024

106కు చేరిన కరోనా మృతుల సంఖ్య…

- Advertisement -
- Advertisement -

Coronavirus

బీజింగ్:  చైనాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రస్తుతం కరోనా మృతుల సంస్థ 106కు చేరింది. దాదాపు 4వేల మందికిపైగా కరోనా వ్యాదితో బాధపడుతున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. క‌రోనా సోకిన‌ బాధితులు నుమోనియా వ్యాధితో ప్రాణాలు కొల్పొతున్నారు. ఈ నేపథ్యంలో పలునగరాలకు రవాణా వ్యవస్థను నిలిపివేసింది ప్రభుత్వం. కాగా ప్రత్యేక వార్డుల ద్వారా బాధితులకు చికిత్సనందిస్తున్నారు.

కరోనా భారత్ కు వ్యాపించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బీహర్ లో ఓ యువతికి కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. చైనా, హాంగ్ కాంగ్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో భయాందోళనలు గురవుతున్నారు. టిబెట్ తప్ప మిగితా చైనా ప్రానిన్సుల్లో క‌రోనా బాధితులు ఉన్నారు.  థాయిలాండ్‌, జ‌పాన్‌, ద‌క్షిణ కొరియా, అమెరికా, వియ‌త్నాం, సింగ‌పూర్‌, మలేషియా, నేపాల్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక దేశాల్లో క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి సమాచారం. కాగా, దేశ‌వ్యాప్తంగా స్కూళ్ల‌కు ప్రభుత్వం సెల‌వులను ప్రకటించింది.

Death Toll From Coronavirus Has Risen to 106
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News