Tuesday, April 23, 2024

కోజికోడ్ విమాన ప్రమాదంలో 19కి చేరిన మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

Death toll rises to 19 in Air India Express crash

కేరళ: కోజికోడ్ విమానాశ్రయంలో రన్ వే పై నుంచి ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 19కి చేరింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు పైలట్ లు సహా ఆరుగురు సిబ్బంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రులకు తరలించారని కేరళ పోలీసులు తెలిపారు. ‘వందేభారత్ మిషన్’లో భాగంగా దుబాయి నుంచి కోజికోడ్ చేరుకున్న విమానం ల్యాండిగ్ సమయంలో రన్ వేపై అదుపుతప్పి జారింది. ఈ ఘోర ప్రమాదంలో బోయింగ్ విమానం రెండు ముక్కలైంది.

ప్రమాద సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులు, 10 మంది చిన్నారులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులు బంధువులు సంప్రదించేందుకు హెల్ప్ లైన్ నంబర్లను కోజికోడ్ కలెక్టర్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు వివరాలకోసం హెల్ప్ లైన్ నంబర్ 0495-2376901 కాల్ చేయాలని కలెక్టర్ సూచించారు. అటు విమాన ప్రమాద బాధిత కుటుంబసభ్యుల కోసం ముంబై నుంచి రెండు ప్రత్యేక సహాయ విమానాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కోజికోడ్ కు ఎఎఐబి, డిజిసిఎ  విమాన భద్రతా విభాగాలు చేరుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News