Home జాతీయ వార్తలు కోటా తీర్పుపై రభసభ

కోటా తీర్పుపై రభసభ

Reservations

 

రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కాదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో లోక్‌సభలో కేంద్రంపై భగ్గుమన్న ప్రతిపక్షాలు

ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లను దెబ్బతీసే ప్రయత్నం సాగుతోంది : కాంగ్రెస్
తీర్పుతో మాకు సంబంధం లేదు, సుప్రీంకోర్టు మా స్పందనను కోరలేదు, రిజర్వేషన్ల అమలుకు కట్టుబడి ఉన్నాం : మంత్రులతో అత్యవసర సమావేశం తర్వాత కేంద్రం ప్రకటన
రిజర్వేష్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలి : ఎల్‌జెపి
కాంగ్రెస్ సారథ్యంలో ప్రతిపక్షాల వాకౌట్

న్యూఢిల్లీ: రిజర్వేషన్ల కేసులో తాము భాగస్వామ్యపక్షంగా లేమని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. రిజర్వేషన్లు రాష్ట్రాల పరిధిలోకి రావని, కో టా ప్రాధమిక హక్కు కాదని సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాలు సభలో సోమవారం తీవ్ర పరిణామాలకు దారితీశాయి. కేంద్రం కావాలనే ఎస్‌సి/ఎస్‌టి కోటాకు తూట్లు పొడుస్తుందని , వీటిని కాపాడటం లేదని ప్రతిపక్షాలు సభలో దాడికి దిగాయి. అధికా ర, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి వాదనలు సా గాయి. దీనితో మంత్రుల స్థాయిలో కూలంకుష చ ర్చ తరువాత ఈ అంశంపై సభలో ప్రభుత్వం సమ గ్ర వివరణకు దిగింది. రిజర్వేషన్ల కోటా అంశం న్యాయస్థానం వరకూ వచ్చింది కేవలం ఉత్తరాఖండ్ ప్రభుత్వ చర్యతో అని కేంద్రం తేల్చిచెప్పింది. దీనితో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. అయితే కేంద్రం బాధ్యతను గుర్తించి రా జ్యాంగయుతమైన కోటాను పరిరక్షించాల్సి ఉందని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి.

రిజర్వేషన్లకు కట్టుబడ్డాం : మంత్రి
కోటా అంశంపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి థావర్‌చంద్ గెహ్లోట్ స్పందించారు. ఉత్తరాఖండ్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వం 2012లో కోటాపై తీసుకున్న నిర్ణయం చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలకు దారితీసిందని తెలిపారు. దీనితో కేం ద్రానికి సంబంధం లేదన్నారు. ఎస్‌సి/ఎస్‌టి/ ఒబిసిలకు రిజర్వేషన్ల అమలుకు కేంద్రం కట్టుబడి ఉం దని, ఉంటుందని స్పష్టం చేశారు. ఇక ఈ అంశంపై కేంద్రం అఫడవిట్‌కు, స్పందనకు న్యాయస్థానం ఆదేశించలేదని తెలిపారు. దీనితో వ్యాజ్యంలో తా ము పార్టీ కాలేకపోయినట్లు వివరించారు. ప్రస్తుతం కోటా అంశం చర్చనీయాంశం అయిందన్నారు. దీనిపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో చర్చించిందని, ఈ విషయంలో సముచిత చర్యలకు దిగుతుందని సభ్యులకు హామీ ఇచ్చారు. అయినా కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్‌లో అధికారంలో ఉన్నప్పుడే కోటా తప్పించిన దాఖలాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. దీనితో ప్రతిపక్ష సభ్యులు లేచి బిగ్గరగా నినాదాలకు దిగారు.

మంత్రి సభను పక్కదోవ పట్టిస్తున్నారని అంటూ సిగ్గు సిగ్గు అంటూ నినదించారు. తరువాత సభ నుంచి వాకౌట్ జరిపారు. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి సహా పలువురు ప్రతిపక్ష సభ్యులు కోటా అంశాన్ని ప్రస్తావించాలని పట్టుపట్టారు. కాంగ్రెస్‌కు డిఎంకె ఇతర ప్రతిపక్షాల సభ్యులు కూడా మద్దతుగా నిలిచారు. దీనితో సభలో చాలా సేపు గందరగోళం నెలకొంది. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ల కల్పన కీలక అంశం అని, బిజెపి తమ సిద్ధాంత కర్త ఆర్‌ఎస్‌ఎస్ అండతో దేశంలో రిజర్వేషన్లకు గండికొడుతోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రతిపక్షాలు సున్నితమైన అంశంతో చెలగాటమాడుతున్నాయని కేంద్ర ప్రభుత్వం సభలో దాడికి దిగింది. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందనేది తమ ఆరోపణ అని సభలో ఉప నేత , మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం సభలో ప్రకటన వెలువరిస్తుందని తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ కలుగచేసుకుని ప్రతిపక్షాల ధోరణి అనుచితంగా ఉందన్నారు. ప్రభుత్వంపై విపక్ష సభ్యుల వ్యాఖ్యలను కొన్నింటిని రికార్డుల నుంచి తొలిగించాలని స్పీకర్ ఓమ్‌బిర్లాకు విజ్ఞప్తి చేశారు.

మోడీతో కోటా రద్దు పర్వం : ప్రతిపక్షాలు
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కోటాకు బీటలు పడుతూ వచ్చాయని ప్రతిపక్ష సభ్యులు విమర్శించారు. ఒక క్రమపద్ధతిలో ఎస్‌సి, ఎస్‌టి కోటాను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని టిఎంసి సభ్యులు కళ్యాణ్ బెనర్జీ, కాంగ్రెస్ ఎంపి అధీర్ ఆరోపించారు. కేంద్రంలో మిత్రపక్షం అయిన లోక్‌జనశక్తి సభుయలు చిరాగ్ పాశ్వాన్ కూడా కోటాకు నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కలుగచేసుకుని రిజర్వేషన్ల అంశాన్ని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాల్సి ఉందని డిమాండ్ చేశారు. కోటాపై నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మొఘ్వాల్ తేల్చిచెప్పారు. దీనితో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదన్నారు.

బిజెపి వైఖరే అది : డిఎంకె
రిజర్వేషన్ల కాపాడాలనే ఆలోచన బిజెపి ప్రభుత్వానికి లేదని డిఎంకె నేత ఎ రాజా చెప్పారు. కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని, కోటాను ఎవరూ తాకకుండా చూడాలని డిమాండ్ చేశారు. కోటాపై సభ అంతా ఏకాభిప్రాయంతోనే ఉందని, ఇది చాలా సున్నితమైన విషయం అని బిజెపి సభ్యులు రాజీవ్ రంజన్ చెప్పారు. దీనిపై రాజకీయాలు వద్దన్నారు. దళితులు , ఎస్‌సి/ఎస్‌టిలంటే కేంద్ర ప్రభుత్వానికి మంట అని బిఎస్‌పి సభ్యులు రితేష్ పాండే విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు పూర్తిగా అనామోదయోగ్యం అని అప్నాదళ్ సభ్యురాలు అనుప్రియ పటేల్ చెప్పారు. కోటా దెబ్బతింటుంటే కేంద్రం చూస్తూ ఉంటుందా? అని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్) సభ్యులు ఇటి మెహమ్మద్ బషీర్ ప్రశ్నించారు. ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని సిపిఎం సభ్యులు ఎఎం అరిఫ్ సూచించారు.

Debate in Lok Sabha on topic of Reservations