Saturday, April 1, 2023

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Debt ridden man commits suicide in Nirmal District

కుంటాల : జీవితంపై విరక్తి చెంది ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని మెదన్‌పూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కుంటాల ఎస్సై సంగమోల్ల శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం… దర్శనం గంగాధర్ (38) అనే వ్యక్తి 108 అంబులెన్స్‌లో ఈఎంటిగా పనిచేస్తున్నారు. అయితే గత సంవత్సరం లాక్‌డౌన్ నుండి అప్పుల పాలయ్యాడు. ఎక్స్‌క్లోజ్ బ్యాంకు రూ. ఒక లక్ష, ప్రైవేటు రూ. ఒక లక్ష 50 వేల అప్పులు దీంతో దాదాపు రూ. 3 లక్షల మేర అప్పుల కావడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఇంట్లోని ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Debt ridden man commits suicide in Nirmal District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News