Friday, April 26, 2024

దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

కోస్గి : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండగ వాతావరణంలో వైభవంగా నిర్వహించాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు.బుధవారం పట్టణంలోని ఎబికె ఫంక్షన్ హాల్‌లో కోస్గి మున్సిపల్, కోస్గి, గుండుమాల్ మండల పరిధిలో దశాబ్ది ఉత్సవాల నిర్వహరణపై సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను,అభివృద్ధి చేసిన పనులను దశాబ్ది ఉత్సవాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.జూన్ 2 నుంచి 22వ తేదీ వరకు 21రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో భాగస్వాములయ్యేలా చూడాలని సూచించారు.

తెలంగాణ ఏర్పాడిన తర్వాత సాధించిన ప్రగతిని, గ్రామాలు, పట్టణాల్లో జరిగిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.పల్లె ప్రగతి ద్వారా గ్రామాలకు వచ్చిన నిధుల వివరాలు,వివిధ సంక్షేమ పథకాల ద్వారా గ్రామ ప్రజలకు జరిగిన లబ్ధిని వివరించి,అభివృద్ధి పనుల వివరాలను ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించాలని సూచించారు.ప్రతి పల్లె, పట్నంలలో నాడు,నేడు ప్రగతికి సంబంధించిన ఫోటోలతో కూడిన ప్లెక్సీలను ఏర్పాటు చేయాలని తెలిపారు.పాలమూర్‌రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పనులు దాదాపు పూర్తి అవుతున్నాయని,త్వరలో కొడంగల్ నియోజకవర్గానికి లక్షా 50వేల ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు తెలిపారు.జూన్ రెండున కోస్గి, కొడంగల్‌లలో అమరవీరుల స్థూలం ఏర్పరచుకొని శ్రద్ధాంజలి ఘటించి జాతీయ జెండాను ఎగురవేయాలని అన్నారు.బిజ్జారం,ముశ్రీఫా చెక్‌డ్యాంల దగ్గరలతో పాటు ఆయా చెరువుల దగ్గర ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి ఆ ప్రాంతమంతా శుభ్రంగా చేసి పెద్ద పెద్ద ఫ్ల్లెక్సీలను ఏర్పాటు చేయాలని అన్నారు.జూన్ తొమ్మిదిన గొర్రెల పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆ శాఖ అధికారులకు ఆదేశించారు.కుల వృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం ప్రారంభిస్తామని అన్నారు.జూన్ 12న తెలంగాణ రన్ కార్యక్రమం కోస్గిలో చేపట్టుతున్నట్లు ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు,అధికారులు,పోలీసులు,యువకులు,విద్యార్థులు,ప్రజలందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొన్నాయని అన్నారు.కోస్గి మున్సిపల్‌లో చేసిన సంక్షేమ పథకాలు,అభివృద్ధ్ది ప్రగతికి సంబంధించిన పెద్ద పెద్ద ఫ్లెక్సీలను ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేయాలని కమిషనర్‌కు సూచించారు.జూన్ 20న మనఊరు మనబడి పథకంలోని పాఠశాలలను ప్రారంభించే విధంగా తగు ఏర్పాట్లు చేయాలని అన్నారు.

ప్రజాప్రతినిధులు,అధికారులు దశాబ్ది వేడుకలను విజయవంతం చేయాలని వారు సూచించారు.కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ శాసం రామకృష్ణ,మున్సిపల్ చైర్ పర్సన్ మ్యాకల శిరీష,ఎంపిపి మధుకర్‌రావు,జెడ్పిటిసి ప్రకాష్‌రెడ్డి,సింగల్ విండో చైర్మన్ తూం భీంరెడ్డి,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి,వైస్ చైర్మన్ వరప్రసాద్,వైస్ ఎంపిపి సాయిలు,కౌన్సిలర్లు భల్లేష్,జనార్థన్‌రెడ్డి,బందెప్ప,మున్సిపల్ కమీషనర్ శశిధర్,తహాశీల్దార్ మమత,ఎంపిడిఓ వెంకటయ్య,నాయకులు మ్యాకల రాజేష్,వెంకట్‌నర్సిములు,జాజీం వెంకటేష్‌లతో పాటు ఆధికారులు,నాయకులు,సర్పంచులు,ఎంపిటిసిలు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News