Home తాజా వార్తలు ఎయిర్ ఇండియాపై నిర్ణయంతో విమానయాన రంగానికి కొత్త శక్తి

ఎయిర్ ఇండియాపై నిర్ణయంతో విమానయాన రంగానికి కొత్త శక్తి

Decision on air india will give new energy to aviation sector

 

న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియాపై నిర్ణయం దేశీయ విమానయాన రంగానికి కొత్త శక్తినిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అప్పల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను ప్రవేటీకరించేందుకు నిర్వహించిన బిడ్డింగ్‌ను టాటా గ్రూప్ గెలుచుకుంది. ఇది జరిగిన రెండు వారాల తర్వాత ప్రధాని ఈవిధంగా స్పందించారు. బుధవారం ఖుషినగర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ… ఎయిర్ ఇండియాపై నిర్ణయం భారత విమానయాన రంగానికి కొత్త ఊపునిస్తుందని అన్నారు. ఈ నెల 11న ఎయిర్ ఇండియా బిడ్డింగ్‌ను టాటా గ్రూప్ సొంతం చేసుకోగా, ఈ సంస్థకు ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్(ఎల్‌ఒఐ)ని కూడా జారీ చేసింది. ఈ నెల ప్రారంభంలో టాటా గ్రూప్‌కు చెందిన టలాస్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన ఆఫర్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎయిర్ ఇండియా రుణం రూ.15,300 కోట్లు బాధ్యత, అలాగే నగదు రూపంలో రూ.2700 కోట్లు చెల్లిస్తామని టాటా సంస్థ ఆఫర్ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఎల్‌ఒఐకి టాటా సంస్థ ఆమోదం తెలిపిన తర్వాత సేల్‌పై వాటా కొనుగోలు ఒప్పందంపై సంతకం చేయనున్నారు.

Decision on air india will give new energy to aviation sector