Home తాజా వార్తలు బొగ్గుటలో సోలార్ పవర్‌ప్లాంట్…

బొగ్గుటలో సోలార్ పవర్‌ప్లాంట్…

Solar Power Plant

 

దశాబ్ధాల కాలంగా తీరిన కల
యువతకు ఉపాధి, అభివృద్ధికి పునాధి
సోలార్ పవర్‌ప్లాంట్ ఏర్పాటుతో ఆనందం వ్యక్తం చేస్తున్న కార్మికులు
20 కిలోమీటర్ల ఉన్న గ్రామాలకు విద్యుత్ అందిచవచ్చన్న సింగరేణి అధికారులు
మొదటి దశలో 150 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం

ఇల్లందు : సోలార్ ఎనర్జీ కా ర్పోరేషన్ ఆఫ్ ఇండియా సింగరేణిలో 300 మెగావా ట్ల సోలార్ పవర్‌ప్లాంట్లను నిర్మించేందుకు అంగీకరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణికి పుట్టినిల్లైన అయిన ఇల్లెందులో 60 మెగావాట్ల సోలార్ పవర్‌ప్లాంట్ నిర్మించేందుకు సింగరేణి సంస్థ్ధ, సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలు అంగీకరించాయి. అందులో మొదటిదశగా 150 మెగావాట్ల సోలార్ పవర్‌ప్లాంట్లను ఏర్పాటుచేయడానికి నిర్ణయం తీసుకుంది. మొదటిదశలో ఇల్లందులో 60 మెగావాట్లు, మణుగూరులో 30 మెగావాట్లు, పెద్దపల్లిలో 50 మెగావాట్లు, సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు ఎన్‌టిపిసిలో 10 మెగా వా ట్ల సోలార్ పవర్ ప్లాంట్‌లను ఏర్పాటుచేసేందుకు ఇరు సంస్ధలు అం గీకరించా యి.

సింగరేణికి పుట్టినిల్లైన ఇల్లందు లో ఆనాటి బ్రిటీష్ అధికారులు ముందుచూపుతో విద్యుత్తు ప్లాం టును నెలకొల్పా రు. 1928వ సం వత్సరంలో 21 ఇంక్లైన్ భూగర్భ గని సమీపంలో మొట్టమొదటి విద్యుత్తు ఉత్పత్తిని చేసే ప్లాంటును ఏ ర్పాటుచేశారు. ఈ ప్లాంటు ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తును బొగ్గు గ నులలో కార్మికులు టబ్బులు నింపే ప్రాంతాలలో వె లుగుకోసం ఉపయోగించేవారు. బ్రిటీష్ వారు ఇండియాను వదిలి వెళ్ళిన తరువాత ఆ విద్యుత్తు ప్లాంటు మరుగునపడింది. అనంతరం దేశానికి స్వతంత్రం రావడం ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడటం జరిగింది. ఉ మ్మడి రాష్ట్రంలో అనేకమార్లు సింగరేణికి పురిటిగడ్డయిన ఇల్లందులో 660 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పాలని డిమాండ్‌లతో పాటు ఉద్యమాలు జరిగాయి.

అయినప్పటికి ఉమ్మడి ఆంధ్ర రా ష్ట్రంలో సీమాంధ్ర పాలకులు పట్టించుకున్న దాఖలాలు లే వు. దశాబ్ధాల కాలం అనంతరం ప్రస్ధుతం తెలంగా ణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సోలార్ పవర్‌ప్లాంట్ ఏ ర్పాటు జరుగుతుండటంతో కార్మికులు ఆనందం వ్య క్తం చేస్తున్నారు. 60 మెగావాట్ల సో లార్ పవర్‌ప్లాంట్‌ను ఏర్పాటుచేయాలంటే సుమారు 300 ఎకరాల స్థ్ధలం అవసరమని అధికారులు తేల్చారు. ఒక్క మె గావాటుకు 5 ఎకరాల చొప్పున 60 మెగావాట్లకు 300 ఎకరాలు స్ధలం కావల్సి ఉంటుంది. 300 ఎకరాలతో పాటు అదనంగా మరో ఆరు ఎకరాలు మొ త్తం 306 ఎకరాల స్ధలాన్ని సింగరేణి సంస్ధ కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది. కాగా 60 మె గావాట్ల పవర్‌ప్లాంటును ఏర్పాటుచేస్తే ఇల్లందుకు మంచి రోజులు రానున్నాయి.

కేవలం 1 లేదా 2 మె గావాట్ల విద్యుత్తుతో ఇల్లందు పట్టణంతో పాటు నా లుగు దిక్కుల ఇరవై కిలోమేటర్ల మేర ఉన్న గ్రామాల కు విద్యుత్తును అందజేయవచ్చని సింగరేణి అధికారులు అంటున్నారు. కేవలం 2 మెగావాట్ల విద్యుత్తుతోనే ఏడాది పొడవునా రెండొందల పల్లెలతో పాటు పట్టణానికి విద్యుత్ సరఫరా చేయవచ్చు మిగతా 58 మెగావాట్లు ఏదైనా విద్యుత్తు సంస్ధలకు విక్రయించడమా లేదా స్టోరేజి చేయడమా అనే దానిపై రెండు సంస్ధ్థలు నిర్ణయం తీసుకోవల్సి ఉంది.

ఏదేమైనప్పటికి బొగ్గుటకు మంచి రోజులు వచ్చాయని సోలార్ పవర్‌ప్లాంట్‌తో ఏరియా భవిష్యత్తు ఆధారపడి వుందని కార్మికులు, కార్మిక కుటుంబాలు భావిస్తున్నాయి. పట్టణంలో ఇప్పటి వరకు చిరు పరిశ్రమ ఉన్న దాఖలాలు లేవు పవర్‌ప్లాంట్ రాకతో ఇల్లందు ప్రజలకు, నిరుద్యోగ యువతకు కాస్త ఊరట లభించిందని చెప్పవచ్చు.

Decision to set up Solar Power Plant