Home Default ఎసిబి వలలో డిఇ, వర్క్ ఇన్‌స్పెక్టర్

ఎసిబి వలలో డిఇ, వర్క్ ఇన్‌స్పెక్టర్

Bribe-Case
మనతెలంగాణ/వికారాబాద్ జిల్లా ప్రతినిధి : మిషన్ భగీరథ కాంట్రాక్టర్ వద్ద రూ. 30 వేలు లంచం తీసుకంటూ డీఈ శ్రీనివాస్, వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేందర్‌లు ఎసిబికి పట్టుబడ్డారు. మంగళవారం సాయంత్రం స్థానిక ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయంలో వలపన్ని వీరిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డిఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. వర్క్ బిలుల్లు చెల్లించేందుకు గాను రూ. 30వేల లంచా న్ని డిఇ డిమాండ్ చేసినట్లు కాంట్రాక్టరు గురువయ్య వివరించారు. డబ్బు లు ఇస్తేనే బిల్లులు చెల్లిస్తానని డిఇ మొండికేయడంతో కాంట్రాక్టర్ ఎసిబి అధికారులను ఆశ్రయించారు. కాంట్రాక్టరు గురువయ్యకు రూ. 22 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. బిల్లులు చేయమని సదరు కాం ట్రాక్టరు గత నెల రోజుల నుంచి అడుగుతున్నా డబ్బులు ఇస్తేనే చేస్తానని డిఇ మొండికేశారు. దీంతో కాంట్రాక్టరు ఎసిబి అధికారులను ఆశ్రయించారు. ప్రణాళిక రూపొందించిన ఎబిసి అధికారులు వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేందర్‌కు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అలాగే డిఇ శ్రీనివాస్ ఇంటిపై కూడా ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు.

DEE Srinivas and Work Inspector Mahender caught on ACB