Friday, March 29, 2024

25 నుంచి డిఇఇసెట్ రెండో విడత కౌన్సెలింగ్

- Advertisement -
- Advertisement -

DEECET second Phase counseling from nov 25th

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డిఇఐఇడి), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(డిపిఎస్‌ఇ) కోరుల్లో ప్రవేశాలకు ఈ నెల 25 నుంచి రెండవ విడత డిఇఇసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు డిఇఇసెట్ కన్వీనర్ మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 25వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈ నెల 27 నుంచి 29 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. డిసెంబర్ 3వ తేదీన సీట్లు కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు డిసెంబర్ 6, 7 తేదీలలో కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News