Friday, March 29, 2024

లైవ్‌లో లవ్ ప్రపోజ్ చేసిన చాహర్

- Advertisement -
- Advertisement -
Deepak Chahar proposes his girlfriend
అమ్మాయికి కూడా ఓకే

దుబాయి: ఐపిఎల్2021 రెండో దశలో భాగంగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం సిఎస్‌కె ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ అందరూ చూస్తుండగా లైవ్‌లో తన గర్ల్‌ఫ్రెండ్‌కు రింగ్ తొడిగి లవ్ ప్రపోజల్ చేశాడు. అందుకు అమ్మాయి వైపునుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో హోరెత్తిపోయింది. చాహర్, అతని ప్రియురాలు ఉంగరాలు మార్చుకున్న తర్వాత ఒకరినొకరు కౌగలించుకుని ఆనందంలో తేలియాడారు. స్టాండ్స్‌లో ఇద్దరి సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ తంతును మొత్తం క్రీడాజగత్తు వీక్షించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టీమిండియా ఆటగాళ్లు సహా మొత్తం క్రీడాప్రపంచం ఈ ప్రేమ పక్షులకు విషెస్ తెలిపింది. కాగా చాహర్ ప్రపోజ్ చేసిన అమ్మాయి విదేశీయురాలని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News