Wednesday, April 24, 2024

నిరంతర రాజకీయ ఎదురు దెబ్బల గురించి పట్టించుకోను: దీపికా పదుకొనే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : టైమ్ మ్యాగజైన్ తన కొత్త ఎడిషన్ ముఖచిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ తార దీపికాపదుకొనేతో అలరించి గౌరవించింది. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఇంటర్వూలో తన మనోభావాలను వెల్లడించింది. తన కెరీర్ గురించి, భారతీయ సినిమాల పాప్యులారిటీ గురించి, అలాగే ఆస్కార్ గెల్చుకున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం గురించి మాట్లాడారు. ఒక పాటకి అవార్డు రావడం, ఒక డాక్యుమెంటరీకి అవార్డు తోనే భారతీయ సినిమా సంతృప్తి పడకూడదు. ఇక ఇప్పటి నుంచి ఆస్కార్ మెయిన్ అవార్డులు కూడా కొల్లగొట్టే పనిలో మొత్తం భారతీయ చిత్రసీమ ప్రయత్నించాలి. ఆర్‌ఆర్‌ఆర్ పాటకి అవార్డు రావడం ఒక మంచి పరిణామం. ఇది తొలి అడుగు మాత్రమే అని ఆమె తన మనోభావాలు వెల్లడించారు.
తన 15 ఏళ్ల కెరీర్‌లో “నిత్యం ఎదురయ్యే రాజకీయ ఎదురుదెబ్బల గురించి అసలు ఏమాత్రం పట్టించుకోను ” అని కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా తన కెరీర్‌లో తానెదురుకున్న కొన్ని సంఘటనలను సంక్షిప్తంగా ఆమె వివరించింది.“ “పదావత్ ” చిత్రం విడుదలైనప్పుడు చారిత్రక వాస్తవాల వక్రీకరణ జరిగిందని దుమారం రేగింది. తన మొదటి చిత్రం “చపక్ ”విడుదలైన సమయంలో జెఎన్‌యు విద్యార్థులతో సంఘీభావం ప్రకటించడంపై విమర్శలు వచ్చాయి. ఎన్నాళ్లూ కాలేదు ఇటీవలనే “పథాన్‌”చిత్రంలో బేషరం రంగ్ పాటలో పాకిస్థాన్ స్పైగా కాషాయ బికినీ ధరించినప్పుడు మత సంప్రదాయాలను మంటగలిపినట్టు గగ్గోలు పుట్టింది. ” అని ఆమె ఉదహరించారు. సుదీర్ఘ విరామం తరువాత టైమ్ మ్యాగజైన్ కథనంలో నిరంతర రాజకీయ ఎదురు దెబ్బలపై ఆమె ఇంటర్వూలో పేర్కొన్నారు.

ఏదో దాని గురించి తాను ఫీల్ అవుతానని అనుకోను. కానీ అసలు వాస్తవం ఏమంటే నేను దేని గురించీ ఏమీ అనుకోను అని ఆమె పేర్కొన్నారు. 37 ఏళ్ల దీపికా పడుకొనే భారతీయ అగ్రనటుల పేర్ల జాబితాలో తన పేరు కూడా చేర్చుకోగలిగింది. షారూఖ్ ఖాన్, ఐశ్వర్యారాయ్, అమీర్‌ఖాన్, ప్రియాంక చోప్రా తదితరుల ముఖచిత్రాలు టైమ్ మ్యాగజైన్‌లో వచ్చాయి. 2018లో టైమ్ మ్యాగజైన్ వంద అత్యంత ప్రభావిత ప్రముఖుల్లో భారత మాజీ క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ, ఓలా సహ సంస్థాపకులు భావిష్ అగర్వాల్ తోపాటు దీపికా పడుకొనే కూడా ఒకరయ్యారు. మే 10 టైమ్ మ్యాగజైన్‌లో దీపికాపదుకొనే పై “ దీపికాపదుకొనే ప్రపంచాన్ని బాలీవుడ్‌కు తీసుకొచ్చింది” అన్నపేరుపై వ్యాసం వచ్చింది. “ఇది భారతదేశ యుగం” అని ఆమె ప్రశంసించారు. ఈ ఏడాది మొదట్లో 95వ అకాడమీ అవార్డుల సందర్భంగా పడుకొనే “నాటునాటు” అసలైన ఉత్తమ గీతంగా వెలుగు లోకి తెచ్చింది. ఆ పాట మొత్తం మోతెక్కించింది అని దీపికాపదుకునే పేర్కొన్నారు. డెన్మార్క్‌లో జన్మించిన దీపికాపదుకొనే 75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు ప్రత్యేక జ్యూరీగా వ్యవహరించారు. అంతర్జాతీయ ఫ్యాషన్ లేబిల్స్‌కు మొదటి ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News