Friday, March 29, 2024

‘ప్రాజెక్ట్ కె’ కోసం హైదరాబాద్‌లో దీపికా పదుకునే…

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ సినిమాలలో టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్‌అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ (వర్కింగ్ టైటిల్) ఒకటి. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం షూటింగ్‌ను ఇప్పటికే ప్రారంభించారు. ఇక ఇప్పుడు మళ్ళీ ఓ కీలక షెడ్యూల్‌ని మేకర్స్ ప్రారంభించబోతున్నారట. ఈ షెడ్యూల్ ఆదివారం నుంచి ప్రారంభం కానుందని సమాచారం. అయితే ఈ షెడ్యూల్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే పాల్గొననుంది. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు దీపికా హైదరాబాద్‌కు వచ్చేసింది. అన్నపూర్ణ 7 ఎకర్స్ స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్ జరుగునుందట. ఈ షూటింగ్‌లో ప్రభాస్ కూడా పాల్గొంటాడని తెలిసింది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. బిగ్ బి అమితాబ్‌బచ్చన్ ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే అమితాబ్‌పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

Deepika Padukone land in Hyd for Prabhas Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News