Home గ్యాలరీ ఎల్లో ట్రాక్ సూట్, వైట్ టాప్ లో దీపికా స్టైలీష్ లుక్…

ఎల్లో ట్రాక్ సూట్, వైట్ టాప్ లో దీపికా స్టైలీష్ లుక్…

బాలీవుడ్ అందాల భామ, పొడుగుకాళ్ల సుందరి దీపిక పదుకొనె ప్రపంచవ్యప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ బ్యూటీ అందానికి అభిమానులే కాదు.. హీరోలు కూడా ఫిదా అవుతారు. దీపిక మీద తమకు క్రష్ ఉన్నట్లు పలువురు హీరోలు బహాటంగానే చెప్పారు. ప్రస్తుతం ఈ బ్యూటీ తన భర్త రన్ వీర్ సింగ్ తో కలిసి కపిల్ దేవ్ బయోగఫ్రీ 83 లో నటిస్తోంది. దీంతోపాటు మహాభారతంలో ద్రౌపతి పాత్రకు దీపికను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ ముంబయి ఎయిర్ పోర్టులో స్టైలీష్ లుక్ లో దర్శనమిచ్చింది. ట్రెండి ఎల్లో ట్రాక్ సూట్ లో, వైట్ టాప్ ధరించి చాలా హాట్ గా కనిపించింది దీపిక. ఇంకేముందు అక్కడున్న ఫోటోగ్రాఫర్లు దీపిక స్టైలీష్ హాట్ లుక్ ను క్లిక్ మనిపించారు.దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Deepika Padukone wearing yellow tracksuit viral Pics