Home తాజా వార్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న దీపిక, రణవీర్

తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న దీపిక, రణవీర్

ముంబై: బాలీవుడ్ జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొణె తమ తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా గురువారం తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని, తిరుపతి సమీపంలోని తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించనున్నారు. గత ఏడాది నవంబర్ 14న వీరి వివాహం ఇటలీలో జరిగింది. దీపికా, రణవీర్ తమ వివాహ వార్షికోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా, నిరాడంబరంగా జరుపుకోనున్నారని వారి కుటుంబ వర్గాలు తెలిపాయి. బుధవారం తమ కుటుంబ సభ్యులతో కలసి తిరుపతికి వారు పయనమవుతారని, గురువారం తిరుమలలో శ్రీవారిని, తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారని వారు చెప్పారు. మరుసటి రోజు నవంబర్ 15న అమృత్‌సర్‌లోని స్వర్ణాలయాన్ని వారు సందర్శిస్తారని తెలిపారు. అదే రోజు వారు ముంబైకి తిరిగివస్తారని చెప్పారు.

Deepika, Ranveer to visit Padmavathi temple