Home తాజా వార్తలు చుట్టేస్తోంది

చుట్టేస్తోంది

డ్రగ్స్ కేసులో తెరపైకి మరికొందరు సినీ తారలు
శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరో భార్య నమ్రత పేర్లు, టాలెంట్ మేనేజర్ జయసాహాతో చాట్ చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు
దీపిక మేనేజర్‌కు ఎన్‌సిబి సమన్లు
వెలుగులోకి దీపిక, మేనేజర్ కరిష్మా మధ్య చాటింగ్
రియా చక్రవర్తికి మరో షాక్, జ్యుడిషియల్ కస్టడీ వచ్చే నెల 6 వరకు పొడిగింపు

మన తెలంగాణ హైదరాబాద్/న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్‌రాజ్‌పుత్ ఆత్మహత్యకు సంబంధించిన డ్రగ్స్‌కేసులో పలువురు సినీ తారల పేర్లు తెరమీదికొస్తున్నాయి. తాజాగా 60 నుంచి 70 మంది పేర్లు ఈ కేసులో వినిపిస్తున్నాయి. నటి దీపికాపదుకొణె మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సిబి) సమన్లు జారీ చేసింది. మంగళవారం హాజరు కావాలని కోరగా, కొంత సమయం కావాలని ఎన్‌సిబిని కరిష్మాప్రకాశ్ కోరారు. ఆమె పని చేసే క్వాన్ టాలెంట్ సిఇఒ ధుర్వ్‌చిట్గోపెకర్‌కు కూడా సమన్లు జారీ చేయగా, విచారణకు హాజరయ్యారు. సుశాంత్ మేనేజర్ శ్రుతిమోడి, టాలెంట్ మేనేజర్ జయసాహాకు కూడా ఎన్‌సిబి సమన్లు జారీ చేసింది. జయసాహా ఎన్‌సిబి ముందు రెండోసారి హాజరయ్యారు. దీపిక, కరిష్మ మధ్య జరిగిన సంభాషణ గురించిజయను ఎన్‌సిబి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు రియా చక్రవర్తి వాట్సాప్ సందేశాల ఆధారంగా వీరందరికీ సమన్లు జారీ చేస్తున్నారు. సుశాంత్ చనిపోవడానికి కొన్ని నెలల ముందు ఆయన కోసం డ్రగ్స్ కొనుగోలుపై రియా సంప్రదింపులు జరిపినట్టు ఎన్‌సిబి గుర్తించింది. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా రియాను ప్రశ్నించినపుడు సారా అలీఖాన్, శ్రద్దా కపూర్ పేర్లు కూడా ఎన్‌సిబి దృష్టి కి తెచ్చినట్టు దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. త్వరలోనే సమన్లు జారీ చేసి ఈ వారంలోనే వారిని ప్రశ్నించనున్నట్టు తెలిపారు. రియా, ఆమె సోదరుడు శౌవిక్‌తోపాటు మరో 16మందిని ఎన్‌సిబి ఇప్పటికే అరెస్ట్ చేసిం ది. వీరి బెయిల్ పిటిషన్‌ను బోంబే హైకోర్టు బుధవారం పరిశీలించనున్నది. మంగళవారం వీరందరికీ మరో 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని(అక్టోబర్ 6 వరకు) హైకోర్టు పొడిగించింది.
విచారణలో టాలీవుడ్ ప్రముఖ హీరో భార్య పేరు
ముంబై డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో టాలీవుడ్‌లోని ప్రముఖ హీరో భార్య పేరు తెరపైకి వచ్చింది. డ్రగ్స్ కేసులో సదరు హీరో భార్య నమత్ర పేరును జాతీయ మీడియా ప్రస్తావించింది. టాలెంట్ మేనేజర్ జయ సాహాతో డ్రగ్స్ విషయమై ఆమె చాట్ చేసినట్టు జాతీయ మీడియా పేర్కొంది. బాంబేలో మంచి ఎండి ఇస్తావని ప్రామిస్ చేశావ్. ఎండి ఇచ్చాక మనం కలిసి పార్టీ చేసుకుందామని చాటింగ్ చేసినట్లు ఎన్‌సిబి అధికారుల విచారణలో తేలింది. ఈ కేసులో ఇప్పటికే కొందరు సినీ నటులు, డ్రగ్స్ పెడ్లర్లను నార్కొ టిక్స్ కంట్రోల్ బ్యూరో విచారిస్తోంది. తాజాగా జయ సాహాని ఎన్‌సిబి విచారిస్తుండగా టాలీవుడ్‌లోని ప్రము ఖ హీరో సతీమణి పేరు బయటికొచ్చినట్టు సమాచారం. కొందరు సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు సాహా వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. ముంబై డ్రగ్స్ కేసులో నటి దియా మీర్జా పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్‌సిబి అధి కారులు దియా ను, ఆమె మేనేజర్‌ను విచారణకు పిలిచే అవకాశముం ది. 2019లో దియా డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. దియాకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు అంగీ కరించిన డ్రగ్ డీలర్స్ ఎన్‌సిబి అధికారుల విచారణలో వెల్లడించారు.
దీపికా, కరిష్మా నడుమ చాటింగ్?
నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు సోమవారం టాలెంట్ మేనేజర్ జయా సాహాను విచా రించగా ప్రముఖ నటి దీపికా పడుకొనే పేరు తెరమీదకు వచ్చిన సంగుతి తెలిసిందే. జయ వాట్సాప్ చాట్ సమా చారాన్ని బట్టి దీపిక, ఆమె మేనేజర్ కరిష్మా డ్రగ్స్ గురిం చి ఆమెతో చర్చించినట్టు అధికారులు భావిస్తున్నారు. అందులో ఉన్న కోడ్ భాషలో ‘డీ’ అంటే దీపిక అని, ‘కే’ అంటే కరిష్మా అని ఎన్సీబీ అధికారులు అనుమానిస్తున్నారు. 2017 అక్టోబర్ 28న దీపిక, ఆమె మేనేజర్ మధ్య ఛాటింగ్ జరిగినట్టు అధికారులు గుుర్తించారు మాల్ కావాలని దీపిక ఛాటింగ్‌లో కరిష్మాను అడిగింది. మాల్ ఇంట్లో ఉందని, తాను వేరే చోట ఉన్నానని దీపిక బదులిచ్చింది కరిష్మా.
కోడ్ ఛాటింగ్ సాగిందిలా..
డీ: మాల్ ఉందా..?
కే : ఇంట్లో ఉంది. నేను బాంద్రాలో ఉన్నా..
కే :అమిత్ తో పంపించాలా..?
డీ : ఎస్ ప్లీజ్,
కే : అమిత్ తెస్తున్నాడు.
డీ : హ్యాష్ యేనా
డీ : వీడ్ కాదు
కే : కోకోకు ఏ టైంలో వస్తావ్.
డీ : రాత్రి 11.30 గుంటలకు లేదా 12 గుంటలకు వస్తా. ఏం టైం వరకు ఉంటుంది.
కే : 11.30 వరకు ఉంటుందని చెప్పింది. 12 వరకు వేరే ప్లేస్ వెళ్లాలంది.

Deepika’s manager summoned in Sushant’s drugs case