Friday, March 29, 2024

ఓటమిని గెలుపుగా మార్చుకొంటున్న ట్రంప్!

- Advertisement -
- Advertisement -

 

అమెరికా నేతలు తమది ప్రపంచంలోనే ప్రముఖమైన ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొంటూ ఉంటారు. కానీ అక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల ఫలితాల సమయంలో గందరగోళం వెల్లడి చేస్తున్నది. అక్కడి ప్రజాస్వామ్యం పక్షపాతంతో, పారదర్శకత లేకుం డా ఉన్నట్లు స్పష్టం అవుతున్నది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఎన్నికల విధానం ఉండ డం, ఓట్లు వేయడం కూడా ఒక్కొక్క విధంగా ఉండడం,పోలింగ్ ముగిసిన తర్వాత కూడా రోజుల తరబడి ఓట్లు వస్తూ ఉండడం గమనిస్తే అమెరికాలో ఎన్నికల విధానమే చాలా లోపభూయిష్టంగా ఉన్నట్లు కనిపిస్తున్నది.

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగిసి పది రోజులు కావస్తున్నది. ఎన్నికలలో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపొందిన్నట్లు అక్కడి మీడియా ప్రకటించడమే గాని అధికారికంగా ఎటువంటి ప్రకటన జరగలేదు. బైడెన్ విజయోత్సవాలలో మునిగి తేలుతున్నారు. అయితే డోనాల్డ్ ట్రంప్ మాత్రం ఓటమిని అంగీకరించడానికి నిరాకరిస్తున్నారు. ఓట్ల లెక్కింపులో మోసం జరిగిన్నట్లు ఆరోపిస్తున్నారు. తాను పదవి నుండి వైదొలిగెడిది లేదని స్పష్టం చేస్తున్నారు. అమెరికా ఎన్నికల ఫలితాల తర్వాత చాలా సున్నితమైన రీతిలోనూ అధికార బదలాయింపు ఉంటుందని ఆయన చెబుతూ అధికార బదలాయింపు రెండవసారి ట్రంప్ పరిపాలనకే ఉంటుందని ఆయన పాలనలో విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో స్పష్టం చేస్తున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమిని అంగీకరించకపోవడం ఇబ్బందికరంగా మారిందని, అధ్యక్ష పదవి హోదాకు అది తగని చర్య అని జో బైడెన్ అంగీకరిస్తున్నారు. అయితే అధికార మార్పిడిని ఎవరూ ఆపలేరని స్పష్టం చేస్తూ ఈ పక్రియను తనకు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. కాగా, అమెరికాలోని పలువురు రాజ్యాంగ నిపుణులు మాత్రం ట్రంప్ అధికారంలో కొనసాగడానికి రాజ్యాంగపరంగా ఎటువంటి అడ్డు ఉండకపోవచ్చని అభిప్రా యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా జనవరి 6న జరిగే అమెరికా కాంగ్రెస్ సమావేశంలో గాని బలాబలాలు తేలే అవకాశం లేదు.

అమెరికా నేతలు తమది ప్రపంచంలోనే ప్రముఖమైన ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొంటూ ఉంటారు. కానీ అక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల ఫలితాల సమయంలో గందరగోళం వెల్లడి చేస్తున్నది. అక్కడి ప్రజాస్వామ్యం పక్షపాతంతో, పారదర్శకత లేకుం డా ఉన్నట్లు స్పష్టం అవుతున్నది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఎన్నికల విధానం ఉండ డం, ఓట్లు వేయడం కూడా ఒక్కొక్క విధంగా ఉండడం,పోలింగ్ ముగిసిన తర్వాత కూడా రోజుల తరబడి ఓట్లు వస్తూ ఉండడం గమనిస్తే అమెరికాలో ఎన్నికల విధానమే చాలా లోపభూయిష్టంగా ఉన్నట్లు కనిపిస్తున్నది.

జాతీయ స్థాయిలో ఒక ఎన్నికల కమిషన్ కూడా లేదు. అందుకనే అధికారికంగా ఎన్నికల ఫలితాలను ప్రకటించే వ్యవస్థ అక్కడ లేకపోవడం గమనార్హం. బహుశా మరే ప్రజాస్వామ్య దేశంలో కూడా ఇటువంటి వివక్షాపూరిత ఎన్నికల విధానం అమలులో లేదని చెప్పవచ్చు. అమెరికాలో అధ్యక్షుడి ఎన్నిక నేరుగా ప్రజాస్వామ్యబద్ధంగా లేకపోవడంతో చాలా క్లిష్టతరం సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. దానితో చట్టబద్ధంగానే ఓటమిని విజయంగా మార్చుకొనే అవకాశాలు ట్రంప్‌కు ఉన్నట్లు న్యాయ నిపుణులు పలువురు భావిస్తున్నారు. నవంబర్ 3 న ఎన్నిక జరిగే సమయంకు ట్రంప్ ఆధిక్యతలో ఉన్నట్లు కనిపించారు. మెయిల్‌లో వచ్చిన వేలాది ఓట్ల పట్ల రిపబ్లికన్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ అభ్యంతరాలను డెమొక్రాట్లు తోసిపుచ్చారు. ఈ సందర్భంగా కోర్టులలో పలు కేసులు నమోదయి ఉన్నాయి.

అయితే ఈ వివాదాలు చట్టసభలలోనే పరిష్కారం కావలసి ఉండడం గమనార్హం. ఇక్కడనే ఆందోళనకర పరిస్థితి ఏర్పడుతున్నది. ట్రంప్ బృందం కూడా చట్ట సభల పరిధిలోకి వివాదాన్ని తీసుకు వచ్చి, ఓటమిని విజయంగా మార్చుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతున్నది. తొమ్మిది స్వింగ్ రాష్ట్రాలలో ఎనిమిది రాష్ట్రాల చట్టసభలలో రిపబ్లికన్లకు ఆధిపత్యం ఉంది. బ్యాలట్ పత్రాలలో గందరగోళం నెలకొన్నదని, అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని వీటిల్లో ఒకటి, రెండు చట్టసభలు నిర్ణయించినా పరిస్థితులు క్లిష్టంగా మారే అవకాశం ఉంటుంది. రిపబ్లికన్లకు అనుకూలంగా మారే అవకాశం లేకపోలేదు. అయితే ఆ నిర్ణయాలకు అభ్యంతరం చెబుతూ డెమొక్రాట్లు కోర్టులను ఆశ్రయిస్తారు. డెమొక్రాట్ల గవర్నర్లు లేదా కార్యదర్శులు తాము ఎంపిక చేసిన వారిని కాంగ్రెస్‌కు పంపుతారు. అప్పుడు ఎవ్వరు అసలు ప్రతినిధుల్లో అన్న గందరగోళం నెలకొంటుంది. అటువంటి గందరగోళం సృష్టించడం కోసమే రిపబ్లికన్లు పథకం వేస్తున్నట్లు కనిపిస్తున్నది.

ఎన్నికైన వారిని సరి చూసుకోవడం కోసం జనవరి 6న అమెరికా కాంగ్రెస్ సమావేశమైనప్పుడు కొందరు ప్రతినిధుల చట్టబద్ధ్దతపై సవాళ్లు ఎదురవుతాయి. దానితో వివాదం నెలకొన్న రాష్ట్రాల ప్రతినిధులను లెక్కలోకి తీసుకోరాదని రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యులు కోరవచ్చు. అటువంటప్పుడు అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న ఏ అభ్యర్ధికి కూడా 270 ఓట్లు రాకపోవచ్చు.

ఇటువంటి అస్థిర పరిస్థితి ఏర్పడినప్పుడు అధ్యక్షుడు ఎవ్వరో నిర్ణయించవలసింది ప్రతినిధుల సభ అని అమెరికా రాజ్యాంగం చెబుతున్నది. అటువంటప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఓటు మాత్రమే ఉంటుంది. ప్రస్తుత బలాలను బట్టి రిపబ్లికన్‌లకు 26 రాష్ట్రాలు, డెమొక్రాట్‌లకు 23 రాష్ట్రాలు ఉన్నాయి. అటువంటప్పుడు సహజంగానే ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా కోర్టులకు వెళ్లకుండా, రాజ్యాంగబద్ధంగానే ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఈ సంక్లిష్ట పక్రియ గురించి అవగాహన కలిగి ఉండడంతోనే రెండు, మూడు నెలలుగా మెయిల్ ద్వారా వచ్చే ఓట్లపై ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎన్నిక జరిగే రోజుకు వచ్చే ఓట్ల ఆధారంగానే ఫలితం ఉండాలని స్పష్టం చేస్తున్నారు. అయితే పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా ఓట్లు వస్తుండటం గమనార్హం. మొదటి నుండి రిపబ్లికన్లు మెజారిటీ ఓట్లతో కాకుండా ఇతర పద్ధతుల ద్వారా అధికారంలోకి రావచ్చని ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. 2018లో అటువంటి పద్ధతుల ద్వారానే విస్కాన్సిన్ రాష్ట్రంలో 45 శాతం ఓట్లతో 65 శాతం సీట్లు పొందారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో అటువంటి ప్రయత్నం చేస్తున్నారు.

1992 నుండి కేవలం ఒక్కసారి మాత్రమే 2004లో అమెరికా దారుణమైన ఉగ్రవాద దాడులను ఎదుర్కొన సమయంలో రిపబ్లికన్ పార్టీ మెజారిటీ ఓట్లు సంపాదించింది. కానీ గత 28 ఏళ్ళల్లో దాదాపు సగం కాలం పాటు ఆ పార్టీ అభ్యర్థులే అధ్యక్షులుగా ఉంటూ వచ్చారు. మైనారిటీ ఓట్లతో అధికారం చెలాయిస్తూ వస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ట్రంప్ కూడా అటువంటి పరిస్థితి కోసమే ఎదురు చూస్తున్నారు.

కొంత కాలంగా వివిధ రాష్ట్రాలలో రిపబ్లికన్ పార్టీలు ఓట్ల విషయంలో ఆంక్షలు విధిస్తు వస్తున్నాయి. 2011లో టెక్సాస్ లో ఓట్ వేయడానికి ప్రభుత్వ ఐడి తప్పని సరిగా ఉండాలని, విద్యార్థి ఐడి పనికి రాదని అంటూ ఒక చట్టం తీసుకు వచ్చారు. 2017లో జార్జియాలో కుంటి సాకులతో ఓటర్ల నమోదుకు ఆటంకాలు కల్పిస్తూ చట్టం తీసుకు వచ్చారు. దాని ద్వారా ప్రధానంగా నల్లజాతీయులు ఓట్ల నమోదుకు అడ్డంకులు ఏర్పరిచారు. ఆ విధంగా ఫ్లోరిడాలో సుమారు కోటి మంది నల్లజాతీయులు ఓటర్లుగా నమోదు కాకుండా గవర్నర్, చట్టసభ కలిసి చేయగలిగారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News