Wednesday, April 17, 2024

నవంబర్ 1 నుంచి డిగ్రీ, పిజి తరగతులు..

- Advertisement -
- Advertisement -

నవంబర్ 1 నుంచి డిగ్రీ, పిజి తరగతులు
అక్టోబర్ 31 వరకు ప్రవేశాలు
నవంబర్ 30 వరకు ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం
వచ్చే ఏడాది మార్చి 8 నుంచి సెమిస్టర్ పరీక్షలు
సవరించిన అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన యుజిసి

మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో డిగ్రీ, పిజి తరగతులు నవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 31 నాటికి ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలని పూర్తి చేయాలి. ఆయా విద్యాసంస్థలు ఖాళీగా మిగిలిన సీట్లను నవంబర్ 30 వరకు భర్తీ చేసుకోవాలి. ఈ మేరకు యూరివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) మంగళవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు కొత్త అకడమిక్ సెషన్ కోసం తరగతులను ప్రారంభించాలి. యుజిసి మొదట ఉన్నత విద్యా సంస్థల కోసం ప్రత్నామ్నాయ అకడమిక్ క్యాలెండర్‌ను ఏప్రిల్ 29న విడుదల చేసింది. దీంట్లో విశ్వ విద్యాలయాలు తమ చివరి సంవత్సరం లేదా టెర్మినల్ సెమిస్టర్ పరీక్షను జూలై 1 నుంచి జూలై 15 వరకు నిర్వహించాలని, ఫలితాలను నెలాఖరులో ప్రకటించాలని సూచిం చింది. కోవిడ్ 19 నేపథ్యంలో మళ్లీ క్యాలెండర్‌ను సంవరించింది. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి ఏడాది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ అకడమిక్ క్యాలెండర్‌కు సంబంధించిన యుజిసి మార్గదర్శకాలపై నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను ఆమోదించినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది. ఈ ఏడాది విద్యాసంవత్సరానికి సంబంధించి నవం బర్ 30 వరకు యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్యాడ్యుయేట్ కోర్సుల్లో తొలి ఏడాది అడ్మిషన్లు రద్దు చేసుకున్న, వలస వెళ్లిన విద్యార్థులకు ఫీజులు తిరిగి చెల్లిస్తారని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులపై మరింత భారం పడకూడదన్న ఉద్దేశంతో ఈ ఒక్కసారికి ప్రత్యేకంగా అవకాశం కల్పించినట్లు చెప్పారు. దీంతో డిగ్రీ, పిజి కోర్సుల్లో తొలి ఏడాది అడ్మి షన్లు నవంబర్ 30 వరకు రద్దు చేసుకునే విద్యార్థులు, వలస వె ళ్లిన విద్యార్థులు వారు చెల్లిం చిన ఫీజులు తిరిగి పొందుతారని పేర్కొన్నారు.

సవరించిన విద్యా క్యాలెండర్

అక్టోబర్ 31వ తేదీలోగా ప్రవేశాల ప్రక్రియ పూర్తి
నవంబర్ 30 వరకు సీట్లు రద్దు చేసుకునే వెసులుబాటు
నవంబర్ 1 నుంచి డిగ్రీ, పిజి మొదటి సెమిస్టర్ తరగతుల ప్రారంభం
2021 మార్చి 1 నుంచి 7 వరకు ప్రిపరేషన్ సెలవులు
2021 మార్చి 8 నుంచి 26 వరకు సెమిస్టర్ పరీక్షలు
2021 మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 వరకు సెమిస్టర్ బ్రేక్
2021 ఏప్రిల్ 5 నుంచి తర్వాత సెమిస్టర్ తరగతుల ప్రారంభం
2021 ఆగస్టు 1 నుంచి 8 వరకు ప్రిపరేషన్ సెలవులు
2021 ఆగస్టు 9 నుంచి 21 వరకు సెమిస్టర్ పరీక్షలు
2021 ఆగస్టు 22 నుంచి 29 వరకు సెమిస్టర్ బ్రేక్
2021 ఆగస్టు 30 నుంచి తర్వాత అకడమిక్ సెషన్ ప్రారంభం

Degree and PG classes starts from Nov in TS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News