Home తాజా వార్తలు మనస్థాపంతో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

మనస్థాపంతో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

student-sucide

కుల్కచర్ల: పరీక్షలు సరిగ్గా వ్రాయలేదన్న కారణంతో మనస్థాపం చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుల్కచర్ల మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గీతాంజలి డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీకాంత్ 21 ప్రస్తుత సంవత్సర పరీక్షలు సరిగ్గా రాయకపోవడం వల్ల మనస్థాపం చెంది ఘండిచెరువు నుండి గాలిగూడెంకు వెళ్ళు దారిలోని అడవిప్రాంతంలో పురుగులమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడటం జరిగిందని తెలిపారు. కుటుంబ కలహాలు కూడా యువకుడి చావుకు కారణమై ఉండొచ్చని గ్రామస్తులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తండ్రి దశరత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రకాంత్ పెర్కొన్నారు.