Home తాజా వార్తలు ఆర్‌ఎంపి నిర్వాకంతో డిగ్రీ విద్యార్థి మృతి

ఆర్‌ఎంపి నిర్వాకంతో డిగ్రీ విద్యార్థి మృతి

Degree Student

 

జ్వరం కోసం వెళ్ళితే హైడోస్ మందులతో కిడ్నీలు చెడిపోయాయి
శవంతో ఆసుపత్రి ముందు ధర్నా
అనుమతి లేకుండా మెడికల్‌లోనే ఆసుపత్రి నిర్వాహణ
డిఎస్పీ రాకతో సద్దుమనిగిన ఆందోళన

పెద్దకొత్తపల్లి : జ్వరంతో ఆసుపత్రికి వచ్చిన విద్యార్థికి ఆర్‌ఎంపి వైద్యుడు హైడోస్ యాంటిబయటిక్ మందులు ఇవ్వడంతో కిడ్నీలు పాడయిపోయి మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం పెద్దకొత్తపల్లి మండల కేంద్ర ంలోని శ్రీలైలి ఆసుపత్రిలో బాచారం గ్రామానికి చెందిన తా ళ్ళ సాయిబాబు (23) అనే డిగ్రీ విద్యార్థి జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం చేరాడు.

దీంతో ఈ విద్యార్థికి సదరు ఆర్‌ఎంపి వైద్యుడు హైడోస్ యాంటిబయాటిక్ మందులు ఇవ్వడంతో జ్వరం తగ్గకపోగా మరింతగా సాయిబాబు ఆరో గ్యం క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకురాగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఇతని కిడ్నీల పై ప్రభావం పడిందని చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం సాయిబాబుని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

కాగా అప్పటి కే సాయిబాబు పరిస్థితి విషమంగా మారి ఆదివారం మృతి చెందాడు. దీంతో ఆగ్రహించి న కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థులు గ్రామస్థులతో కలిసి పెద్దకొత్తపల్లిలోని శ్రీలైలి మెడికల్ షాపు ముందు ఆదివారం శవంతో ధర్నా నిర్వహించారు. ఆసుపత్రి ముందు ధర్నా చేస్తున్న మృ తుని బం ధువులు, తల్లిదండ్రులతో డిఎస్పీ లక్ష్మినారాయణ స్థానిక సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ జడ్పీటిసి వెంకట య్య అక్కడి కి చేరుకొని వారిని నచ్చజెప్పి ఆందోళన విరమింపజేయించారు. అనంతరం సాయిబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

మృ తుని తండ్రి ఫిర్యాదు మేరకు లైలి ఆసుపత్రి విష్ణుప్రతాప్ రెడ్డి పై 3042 ఐ సిఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు. పోస్టుమార్టమ్ రిపోర్టు వచ్చిన వెంటనే ద ర్యా ప్తు చేస్తామని ఆయన వివరించారు. ఇడిఎంహెచ్ ఓ సుధాకర్ లాల్ మాట్లాడుతూ రెండు సంవత్సరాల కిందనే ఆ సుపత్రిని సీజ్ చేశామని చెప్పారు. ప్రస్తుతం మెడికల్ షా పులో ఆసుపత్రి నడపడం చట్ట విరుద్ధమని మెడికల్ షాపు, వైద్యుడి పై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

Degree Student dead due to RMP Negligence