ముంబై : ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక విజయం సాధించింది. ఈ గెలుపుతో రిషబ్ సేన ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగుల చేసింది. రవిచంద్రన్ అశ్విన్, దేవ్‌దూత్ పడిక్కల్ మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అశ్విన్ రెండు సిక్సర్లు, 4 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. ధాటిగా ఆడిన పడిక్కల్ ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 48 పరుగులు సాధించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 18.1 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 52(నాటౌట్), ఆల్‌రౌండర్ మిఛెల్ మార్ష్ (89) ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించారు.
Delhi Capitals register comfortable win