Home తాజా వార్తలు ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు బెయిల్

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు బెయిల్

Kejriwal

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు 2013 ఎన్నికల్లో నామినేషన్ సందర్భంగా తప్పుడు అఫిడవిట్ ఇచ్చార్న కేసులో శనివారం బెయిల్ మంజూరైంది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆశిష్ గుప్తా బెయిల్ మంజూరు చేశారు.

రూ. 10 వేల వ్యక్తిగత పూచీకత్తుపై కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 7కి వాయిదా వేశారు. ఈ కేసుకి సంబంధించి బెయిల్ ప్రొసీడిండ్స్ పెండింగ్‌లో ఉండడంతో కేజ్రీవాల్ ఇవాళ కోర్టుకు హాజరయ్యారు.