Home ఆఫ్ బీట్ వీడియోలు లవర్స్.. ఆన్ బైక్ రొమాన్స్…!(వైరల్ వీడియో)

లవర్స్.. ఆన్ బైక్ రొమాన్స్…!(వైరల్ వీడియో)

Delhi Couple on Bikeన్యూఢిల్లీ: కొన్ని నెలల కిందట ముంబైలో ఇద్దరు ప్రేమికులు భారీ వర్షంలో రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పై రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే కొవలోనే దేశ రాజధాని ఢిల్లీలో ఓ ప్రేమ జంట నడిరోడ్డుపై రెచ్చిపోయింది. అది కూడా ఏకంగా రన్నింగ్ బైక్ పై రొమాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అత్యంత రద్దీగా ఉన్న రోడ్డుపై ప్రియుడు బైక్ నడుపుతుంటే ప్రేయసి ఫ్యూయల్ ట్యాంక్ పై కూర్చొని అతగాడిని ముద్దులతో ముంచెత్తడం వీడియోలో కనిపిస్తోంది. ఈ నెల 1వ తేదీన ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఓ ఐపిఎస్ స్థాయి అధికారి వీడియోను ట్విట్టర్ లో పెట్టారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరవృతం కాకుండా కొత్త ట్రాఫిక్ నిబంధనలు తీసుకురావాలని ఈ సందర్భంగా ఐపిఎస్ అధికారి కోరారు. ఆయన ట్విట్టర్ లో పెట్టిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేశారు. దీంతో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పలువురు నెటిజన్స్ ఆ జంటపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

Delhi Couple Caught Making Out on Bike in Rajouri Garden