Home జాతీయ వార్తలు ప్రియా రమణితో రాజీకి వస్తారా?

ప్రియా రమణితో రాజీకి వస్తారా?

Delhi Court Comments On MJ Akbar Caseఎంజె అక్బర్‌ను అడిగిన కోర్టు

న్యూఢిల్లీ: జర్నలిస్టు ప్రియా రమణిపై దాఖలు చేసిన నేరపూరిత పరువు నష్టం కేసులో ఆమెతో రాజీ కుదుర్చుకునే అవకాశం ఉందా అని మాజీ కేంద్ర మంత్రి ఎంజె అక్బర్‌ను ఢిల్లీ కోర్టు శనివారం ప్రశ్నించింది. 20 ఏళ్ల క్రితం జర్నలిస్టుగా ఉన్న కాలంలో అక్బర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ప్రియా రమణి ఆరోపించడంతో ఆమెపై అక్బర్ పరువునష్టం కేసు దాఖలు చేశారు.
2018లో మీ టూ ఉద్యమ కాలంలో అక్బర్‌పై తాను చేసిన ఆరోపణలు వాస్తవమని, ప్రజల మేలు కోసమే తాను ఈ ఆరోపణలు చేశానని రమణి చెప్పారు. ఈ కేసుపై విచారణ జరుపుతున్న జడ్జి గత బుధవారం వేరే కోర్టుకు బదిలీ కావడంతో దీనిపై అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాండే శనివారం తుది విచారణ మళ్లీ కొత్తగా చేపట్టారు. ఈ కేసులో రాజీకి వచ్చే విషయమై ఈ నెల 24న కోర్టుకు సమాధానం ఇవ్వాలని వాదప్రతివాదులను ఆదేశించారు.