Friday, April 19, 2024

శశి థరూర్‌పై అభియోగాల నమోదుపై తీర్పు రిజర్వ్ చేసిన ప్రత్యేక కోర్టు

- Advertisement -
- Advertisement -

Delhi Court Reserves Order On Shashi Tharoor In hia wife Death Case

 

న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో ఆమె భర్త, కాంగ్రెస్ ఎంపి శశి థరూర్‌పై అభియోగాల నమోదుకు సంబంధించిన కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం తన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసుల తరఫు న్యాయవాది వాదనలతోపాటు శశి థరూర్ తరఫు న్యాయవాది వాదనలను కూడా ఆలకించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గీతాంజలి గోయల్ ఏప్రిల్ 29న తుది ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉంది.

దేశ రాజధానిలోని ఒక లగ్జరీ హోటల్‌లో 2014 జనవరి 17వ తేదీ రాత్రి సునంద పుష్కర్ మరణించి కనిపించారు. ఆ సమయంలో శశి థరూర్ అధికారిక నివాసానికి మరమ్మతులు జరుగుతున్న కారణంగా థరూర్ దంపతులు ఆ హోటల్‌లోని ఒక సూట్‌లో బసచేశారు. థరూర్‌పై ఐపిసిలోని 498ఎ, 306 సెక్షన్ల కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు కాని అరెస్టు చేయలేదు. 2018 జనవరి 5న థరూర్‌కు బెయిల్ లభించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News