Tuesday, February 7, 2023

హాస్పిటల్ కు తీసుకెళ్లు… రెండు వేలు పట్టుకెళ్లు…!!

- Advertisement -

accident images

అది భారత దేశం… రోడ్డు మీద ఏదో యాక్సిడెంట్ జరిగింది. పొద్దు పొద్దుగాల జరిగినట్టుంది ఆ యాక్సిడెంట్. బైక్ మీద వెళ్తున్న వ్యక్తిని గుద్ది వెళ్లింది ఏదో వాహనం. ఆ వ్యక్తి రక్తపు మడుగులో రోడ్డు పక్కన పడి ఉన్నాడు. ఉదయం దాటి మధ్యాహ్నం కావస్తున్నది.. కాని, అతడిని పట్టించుకునే నాథుడే లేడు… తర్వాత ఎవరో ఓ వ్యక్తి అతడిని గమనించి హాస్పిటల్ కు తీసుకెళ్లగా చావును తప్పించకున్నాడు. ఇది ఫేక్ స్టోరీ కాదు.. రియల్ గా జరిగిన స్టోరి.

మనం మనుషులమే కాని.. మనకు మానవత్వం మచ్చుతునకైనా లేదు. రోడ్డు మీద ఎవరైనా పడి ఉన్నా మనం పట్టించుకోము.. మనకెందుకులే, ఎవరో ఒకరు రాకపోతారా… హాస్పిటల్ కు తీసుకెళ్లక పోతారా అనే ఎస్కేపిజం.

ఇటువంటి వాటిని రూపుమాపడానికే… డిల్లీ ప్రభుత్వం ఓ మాంచి పాలసీ ని తీసుకొచ్చింది. డిల్లీలో ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా.. వెంటనే అక్కడ ఉన్న వాళ్లు.. యాక్సిడెంట్ కు గురయిన వాళ్లను దగ్గర్లోని హాస్పిటల్ లో చేరిస్తే… వెంటనే వారికి రివార్డు కింద రూ. 2000 తో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందజేస్తారట.

అయితే.. చాలా మంది యాక్సిడెంట్ అయిన వాళ్లను హాస్పిటల్ కు తీసుకెళ్తే తర్వాత పోలీసులు కేసు అని, అది అని, ఇది అని చాలా రోజులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించుకుంటారని, అందుకే.. మనకెందుకులే ఈ గొడవ అని చాలా మంది దయార్ద హృదయులైనప్పటికీ…. హాస్పిటళ్లకు తీసుకెళ్లడానికి జంకుతున్నారట.

అందుకే…దీనిపై సేవ్ లైఫ్ అనే ఎన్జీవో వేసిన పిల్ పై కొంచెం సీరియస్ గానే స్పందించిన సుప్రీం కోర్టు.. ప్రజలపై ఇటువంటి భారాన్ని రుద్దొద్దని పోలీసు బాస్ లకు ఆర్డర్ జారీ చేసింది.

అందుకే.. డిల్లీ గవర్నమెంట్.. గుడ్ సామరిటన్ పాలసీ అనే ఓ పాలసీ ని ప్రవేశపెట్టింది. ఇకనైనా… యాక్సిడెంట్ ఎక్కడైనా జరిగితే.. తక్షణమే స్పందించే చేతులు మరిన్ని రావాలని కోరుకుందాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles