Friday, March 29, 2024

ఢిల్లీలో కరోనా ఉధృతి.. కోలుకుంటున్న ఆరోగ్యమంత్రి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా సోకిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతోంది. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసియూలో చికిత్స పొందుతోన్న జైన్ శనివారం ప్లాస్మా థెరపీ జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక, కరోనా తీవ్రత పెరుగుతుండడంతో ఢిల్లీలో ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్సలకు అనుమతిని ఇచ్చిన ప్రభుత్వం దీనికి సంబంధించి ఛార్జీలను ఖరారు చేసింది. ఐసోలేషన్ బెడ్స్‌కు ప్రతిరోజు చొప్పున రూ 8వేలు నుంచి 10వేలుగా ఖరారు చేశారు. వెంటిలేటర్‌తో కూడిన ఐసోలేషన్ బెడ్స్‌కురోజువారిగా రూ15500 నుంచి రూ 18000గా నిర్ణయించారు.

కాగా, ఆదివారం ఒక్కరోజే ఢిల్లీలో 3630 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 56,000కు చేరింది. మృతుల సంఖ్య 2,112కు చేరిందని అధికారులు తెలిపారు. 24 గంటల వ్యవధిలో ఢిల్లీలో 77 మంది కరోనాతో కన్నుమూశారని అధికారులు తెలిపారు.

Delhi health minister condition improves from Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News