Thursday, April 25, 2024

ఢిల్లీ పోలీసుల తీరును తప్పుపట్టినందుకు…. హైకోర్టు న్యాయమూర్తి బదిలీ…

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: ఢిల్లీ పోలీసుల తీరును హైకోర్టు తప్పుపట్టడంతో న్యాయమూర్తి మురళీధర్ ను బదిలీ చేశారు. జస్టిస్ మురళీధర్‌ను హర్యానాకు బదిలీ చేస్తూ అర్థరాత్రి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ బదిలీల్లో భాగమేనని సుప్రీంకోర్టు తెలిపింది. ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడంతోనే అల్లర్లు చెలరేగాయని ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఎలా దర్యాప్తు చేస్తున్నారని ఢిల్లీ పోలీసులను న్యాయమూర్తి మురళీధర్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వుల మేరకు  మురళీధర్ ను హర్యానా, పంజాబ్ హైకోర్టుకు సుప్రీం బదిలీ చేసింది. ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో ఇప్పటిరవకు 34 మంది మృతి చెందారు. ఈ అల్లర్లలో 200 మందికి పైగా గాయపడ్డారు. ఈశాన్య ఢిల్లీలో ప్రస్తుతం 144 సెక్షన్ అమలవుతోంది.

 

Delhi High Court Judge transfer to Haryana Court,
Justice Muralidhar was hearing the Delhi violence case on Wednesday. The notification of his transfer came on the same day when a bench headed by him expressed “anguish” over the Delhi Police’s failure in checking the violence.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News