Thursday, March 28, 2024

లిక్కర్ స్కాంలో ఢిల్లీ సిఎం, ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో గురువారం మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భాగంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండో ఛార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్లను ప్రస్తావించింది. అలాగే అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రా, విజయ్ నాయర్, బినోయ్ బాబు సహా మొత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి వచ్చిన డబ్బును ఆప్ గోవాలో ఎన్నికల ప్రచారానికి ఉపయోగించినట్లు ఈడీ స్పష్టం పేర్కొంది.

ఈడీ దాఖలు చేసిన చార్జీషీట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. అలాగే విచారించిన జాబితాలో కవిత పేరును ఈడీ పేర్కొంది. ఇక ఈడీ ఛార్జ్ షీట్ లో తన పేరును ప్రస్తావించడంపై కేజ్రీవాల్ స్పందించారు. అవినీతికి వ్యతిరేకంగా ఈడీ పని చేయడం లేదన్నారు. ప్రభుత్వాలను కూల్చడానికి ఈడీ పని చేస్తోందని మండిపడ్డారు. ఈ ఛార్జ్ షీట్ ఒక కల్పితమని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొట్టిపడేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News