Home జాతీయ వార్తలు ఇంటర్వ్యూకు పిలిచి ఎంబిఏ గ్రాడ్యుయేట్‌పై అత్యాచారం

ఇంటర్వ్యూకు పిలిచి ఎంబిఏ గ్రాడ్యుయేట్‌పై అత్యాచారం

ముంబై: ఇంటర్వ్యూ అని హోటల్ రూముకు పిలిచి ఒక 28 ఏళ్ల ఎంబిఎ గ్రాడ్యుయేట్‌పై అత్యాచారానికి పాల్పడిన ఒక ఢిల్లీ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణ సంఘటన ఈ నెల 19న జరిగింది. బాధితురాలు గత ఏడాది ఉత్తర్ ప్రదేశ్‌లోని తన స్వగ్రామం నుంచి ముంబైకు వచ్చి ఇక్కడ ఒక పిజి వసతి గృహంలో ఉంటోంది. అయితే ఒక ప్రైవేట్ కంపెనీకి రాజీనామా చేసి తిరిగి తన స్వగ్రామానికి ఆమె వెళ్లిపోయింది. ఏప్రిల్‌లో తిరిగి వచ్చిన ఆమె ఆన్‌లైన్ నెట్‌వర్కింగ్ సైట్లలో మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు సాగిస్తోంది. సాహిల్ సింగ్ అరోరా అనే వ్యక్తి జూలైలో ఆమెను సంప్రదించి రూ. 30,000 నెల జీతం ప్యాకేజీతో ఒక ప్రైవేట్ బ్యాంకులో హెచ్‌ఆర్ విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. సెప్టెంబర్ 19న జుహులోని ఒక హోటల్‌లో ఇంటర్వూకు హాజరుకావాలని ఆమెకు ఫోన్ చేశాడు. ఆమె గదిలోకి ప్రవేశించగానే తలుపు లాక్ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు వరకు ఆమెపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడి ఎవరికీ చెప్పవద్దని, చెబితే వీడియోలను ఆమె తండ్రికి పంపిస్తానని బెదిరించాడు. అయితే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరోరాను అరెస్టు చేశారు.

 

Delhi Man Rapes 28-Year-Old Job Aspirant in Juhu Hotel Room, Threatens to Share Sexual Assault Video With Her Father