Tuesday, April 23, 2024

చీర ధరిస్తే నో ఎంట్రీ ఏమిటి?

- Advertisement -
- Advertisement -
saree row in delhi

మహిళా కమిషన్ ఆగ్రహం
ఢిల్లీ రెస్టారెంట్‌కు సమన్లు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని అన్సల్ ప్లాజాలో గల అఖిల రెస్టారెంటుకు చీర ధరించి వచ్చిన మహిళను అనుమతించని వ్యవహారంపై దర్యాప్తు జరపాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సిడబ్లు) ఆదేశించింది. తగిన చర్యలు తీసుకోవాలంది. అంతేకాక సెప్టెంబర్ 28న తమ ముందు హాజరుకావాలని ఆ రెస్టారెంట్ మార్కెటింగ్, పబ్లిక్‌రిలేషన్ డైరెక్టర్‌కు నోటీసు జారీ చేసింది. ‘భారతీయ మహిళలు చీర ధరించడం అన్నది భారతీయ సంస్కృతి’ అని స్పష్టంచేసింది. కాగా రెస్టారెంట్ సిబ్బంది ప్రవర్తనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ రెస్టారెంట్‌లో ఆదివారం జరిగిన ఈ వింత సంఘటన సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News